కార్డు పెట్టకుండానే ఏటీఎంలో కరెన్సీ
కార్డు స్వైపింగ్ చేయకుండా ఏటీఎం నుంచి డబ్బులు రావడం మీరెక్కడైనా చూశారా? చూడలేదా? ఐతే ఒడిషా వెళ్లాల్సిందే.. అక్కడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో కార్డు స్వైప్ చేయకుండానే కరెన్సీ కుప్పలు తెప్పలుగా బైటకు రావడం కలకలం సృష్టిస్తోంది.. పెద్దనోట్ల రద్దు సమయంలో జనం నెత్తీనోరు బాదుకున్నా పైసా విదల్చని ఏటీఎంలు ఇప్పుడు కార్డు పెట్టకుండానే కరెన్సీ వర్షం కురిపిస్తుండటంతో అందరూ అవాక్కవుతున్నారు.. విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు నాలిక్కరుచుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టారు.. ఏటీఎం సాఫ్ట్‌వేర్ పాతది కావడంతో స్థానిక హ్యాకర్లు ఇలా ప్లాన్ చేసి ఉంటారని ఎస్‌బీఐ సీనియర్ అధికారులు అంటున్నారు.. దీనిపై ఫోరెన్సిక్ విచారణకు ఆదేశించామని, ఆరు వారాల్లో రిపోర్టు వస్తుందని చెబుతున్నారు.. ఒడిశాలోనే కాకుండా ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా దాదాపు 10 ఏటీఎంలలో పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉందని ఇండియా అండ్ సౌత్ ఏషియా ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ నవరోజ్ దస్తూర్ తెలిపారు..
No comments