అమ్మో డ్యాన్స్ చేశా, నా భార్య చంపేస్తుందేమో : గౌతమ్ గంభీర్
ఆటలో ఉన్నా, ఫ్రెండ్స్‌తో ఉన్నా, మరెక్కడైనా కాలక్షేపం చేస్తున్నా గౌతమ్ గంబీర్ ఎప్పుడూ సీరియస్‌గా, గంభీరంగా ఉంటాడు.. పార్టీ మూడ్ అంటే ఏంటో తెలియని గంభీర్‌కు డ్యాన్స్ చేయాల్సి వచ్చింది.. అందుకే గంభీర్‌కు ఇప్పుడు తన భార్య నటాషా ఏమంటుందోనన్న భయం పట్టుకుంది.. అదేంటి చిన్నపిల్లాడిలా భయపడటం.. అసలు డ్యాన్స్ చేస్తే భార్య ఏమంటుందని అనుకుంటున్నారా? గతంలో భర్తను ఎన్నోసార్లు డ్యాన్స్ చేయాల్సిందిగా నటాషా కోరినా గౌతీ నో చెప్పాడంట.. చివరికి బావమరిది బ్యాచిలర్‌పార్టీ వేడుకలోనూ డ్యాన్స్‌చేయలేదంట గౌతీ.. ఇది నేరంతో సమానమని అప్పుడు నటాషా సీరియస్ అయినా గౌతీ పట్టించుకోలేదంట.. ఆఖరికి కేకేఆర్‌యజమాని షారుఖ్‌సైతం గంభీర్‌ను డ్యాన్స్‌చేయమని కోరేవాడట. అప్పుడూ ఒప్పుకోలేదు.. అలాంటిది ఓ ప్రకటన కోసం తొలిసారి గంభీర్‌స్టెప్పులేశాడు.. ఎన్నో సార్లు బతిమాలినా ఒప్పుకోని తాను ఇప్పుడు డ్యాన్స్‌చేసే సరికి నటాషా తనను చంపేస్తుందేమో అని సరదాగా చమత్కరించాడు గంభీర్..
No comments