ఉరి వేసుకోవడానికైనా సిద్ధం : ఉమాభారతి
అయోధ్యలో రామమందిరం నిర్మాణం వ్యవహారంపై కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఈ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నా. దానిపై అపారమైన గౌరవం ఉంది. ఇందులో భాగంగా నేను జైలుకు వెళ్లాల్సివస్తే వెళ్తా. నన్ను ఉరివేసుకోమన్నా వేసుకుంటా’ నని వ్యాఖ్యానించారు కేంద్ర మంత్రి ఉమాభారతి.. లక్నోలో యూపీ సీఎం యోగితో భేటీ అనంతరం మీడియా అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు మంత్రి.. అయోధ్యలో రామమందిరం నిర్మాణం అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున దీనిపై ఎక్కువగా విలేకర్లతో మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు.
No comments