1

Breaking News



విశాఖ జిల్లలో జోరుగా సాగుతున్న గంజాయి




విశాఖ జిల్లా రాయవరం మండలంలో గంజాయి రవాణా జోరుగా సాగుతుంది. కార్లలో కేజీల కొద్దీ గంజాయిని ఇతర ప్రాంతాలకు రవాణా చేసేస్తున్నారు. అడ్డురోడ్డు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు గంజాయి తరలించేందుకు యత్నించారు. అయితే అక్కడే వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి, గంజాయి ని తరలిస్తున్న కారును అక్కడే వదిలి పారిపోయారు. కేసు నమోదు చేసుక్కున్న పోలీస్ నిందితులకోసం గాలిస్తున్నారు. కారును, కారులో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

No comments