1

Breaking News



ఆ కోడి మాంసం వాడం : కేఎఫ్‌సీ




కస్టమర్స్‌ఆరోగ్యం దృష్ట్యా యాంటిబయోటిక్స్‌ఉపయోగించిన కోడి మాంసాన్ని ఇకపై తమ ఉత్పత్తుల్లో వాడబోమని ప్రకటించింది కేఎఫ్‌సీ.. వచ్చే ఏడాది చివరి నాటికి అమెరికాలోని నాలుగు వేల రెస్టారెంట్లలో ఈ మాంసం వాడకాన్ని పూర్తిగా నిలిపివేస్తామని ఆ ప్రకటనలో తెలిపింది.. దీనికోసం ఇప్పటికే దాదాపు రెండువేల కొత్త కోళ్లఫారాలతో సంప్రదింపులు కూడా జరిపినట్లు కేఎఫ్‌సీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. పదార్థాల తయారీలో ఉపయోగించే కోళ్లు తక్కువకాలంలో ఎక్కువ మాంసంతో పెరగడానికి, ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని యాంటిబయోటిక్స్‌ని ఎక్కిస్తారు. వీటివల్ల వినియోగదారుల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు.. వారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతోందనే వాదనలు వినిపించడంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కేఎఫ్‌సీ తెలిపింది. అంతేకాదు పదార్థాలకు రంగు, వాసన రావడానికి ప్రస్తుతం వాడుతున్న రసాయనాలను కూడా ఇకపై వాడబోమని తెలిపింది కేఎఫ్‌సీ..

No comments