వేస్ట్ ఫుడ్‌తో ఐస్‌క్రీంలు తయారీ…
అమెరికాలో ఫుడ్ వేస్టేజ్‌ఎక్కువ.. దాదాపు 30 నుంచి 40 శాతం ఆహార పదార్థాలను అమెరికన్లు వృథాగా పడవేస్తున్నారని పలు సర్వేలు ఇప్పటికే స్పష్టంచేశాయి.. ఈ నేపథ్యంలో ఓ సంస్థ వృథాగా పడవేసే పదార్థాలతో నోరూరించే ఐస్‌క్రీమ్‌లను తయారు చేస్తూ అందరినీ అశ్చర్యానికి గురి చేస్తోంది..
సాల్ట్ అండ్ స్ట్రా ఐస్ క్రీమ్..
అమెరికాలోని పోర్ట్‌లాండ్‌కు చెందిన సాల్ట్‌అండ్‌స్ట్రా ఐస్ క్రీమ్ కంపెనీ పలు సంస్థలతో కలిసి ఈ ఆలోచన చేసింది.. ఏటా పెరిగిపోతున్న ఆహార పదార్థాల వృథాను తగ్గించేందుకు ఐస్‌క్రీంలను తయారు చేయాలని నిర్ణయించింది. దానిమ్మ పండు మీద అక్కడక్కడ మచ్చలు కనిపిస్తే దాన్ని కొనేందుకు చాలా మంది ఇష్టపడరు. అలాంటి పండ్లను.. ఇతర పదార్థాలను సేకరించి ఐస్‌క్రీంలను తయారు చేయొచ్చని నిరూపిస్తున్నారు సంస్థ నిర్వాహకులు.. ఇలా తయారు చేసిన ఐస్‌క్రీంల్లో అన్ని రకాల పోషకాలు ఉంటాయని కూడా చెబుతోంది సంస్థ.. అంతే కాదు చక్కగా శుద్ధి చేసిన పదార్థాలతోనే ఐస్‌క్రీంలను తయారు చేస్తామని, వినియోగదారులకు ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని కూడా భరోసా ఇస్తోంది..
No comments