అమలాపాల్ అంతపనిచేసిందా !?
అమలాపాల్.. ఈ బాలీవుడ్ భామ ఏం చేసినా వివాదమే.. హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టిన నాటి నుంచి కాంట్రవర్శీలు ఈ అమ్మడు చుట్టూ వైఫైలా తిరుగుతూనే ఉన్నాయి.. మొదట భర్త తండ్రితో ఎఫైర్ పెట్టుకునే మహిళ పాత్రలో నటించి మహిళా సంఘాల ఆగ్రహానికి గురైంది. ఆ తరువాత కూడా మరికొన్ని వివాదాల్లో ఈ అమ్మడు పేరు వినిపించింది.. ఇటీవల భర్త విజయ్ తో విడాకుల విషయం కూడా హెడ్‌లైన్ వార్తల్లో నిలిచింది.. ఇలా ఈ హాట్ భామ ఏం చేసినా హాట్‌హాట్ వివాదాలు ముసురుకుంటాయి.. తాజాగా ఈ హాట్ బ్యూటీ అంతే హాట్‌హాట్‌గా యోగా ఫోటోషూట్ చేసి వివాదాస్పదం చేసుకుంది.. బుద్ధుడి ముందు యోగా చేస్తున్నట్టుగా ఫోటో షూట్ చేయించుకుంది అమలా పాల్. అయితే ఈ ఫోటోలో శీర్షాసనం వేసిన ఫోటోలో అమలా కాళ్లు బుద్దుడి ముఖం మీద ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. దీంతో బౌద్దాన్ని అనుసరించే వారి మనోభావాలు దెబ్బతిన్నాయి. శాంతికాముకులకే ఆగ్రహం తెప్పించిన ఈ అమ్మడు మాత్రం ఇంతవరకు స్పందించలేదు..
No comments