1

Breaking News



పీకే అంటే పవన్ కళ్యాణ్ కాదు..ప్యాకేజీ కళ్యాణ్..


పీకే అంటే పవన్ కళ్యాణ్ కాదు.. ప్యాకేజీ కళ్యాణ్.. పవర్ బ్రోకర్ కళ్యాణ్.. అంటూ అసెంబ్లీ మీడియా పాయింట్ సాక్షిగా రోజా చెప్పిన కొత్త భాష్యం ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.. అవునా పవన్ కళ్యాణ్ చంద్రబాబు జేబులో మనిషేనా? సర్కార్ సమస్యల్లో చిక్కుకున్న ప్రతీసారీ పవర్‌స్టార్ పవనాలు సుడిగాలిలా వచ్చి చంద్రబాబును సేఫ్ జోన్‌లో పడేస్తున్నాయా? ఆయనకు స్వతహాగా రాజకీయం తెలియదా? పవన్ ప్రశ్నలు అధికారపార్టీని నిలదీస్తున్నాయా? ప్రతిపక్షాలుచేస్తున్న ఆందోళనను పక్కదారిపట్టిస్తున్నాయా? ఏది నిజం.. ఎవరు నిజం.. కొమురం పులి గాండ్రింపులు ఉత్తుత్తివేనా?  ఇప్పుడీ పాయింట్‌పైనే పొలిటికల్ సర్కిల్స్‌లో బిగ్ డిబేట్‌ నడుస్తోంది.. అమరావతిలో భూముల గొడవ తీసుకున్నా.. కాపుల పంచాయతీ సర్కార్‌ను కంగారెత్తించిన ఎపిసోడ్‌ను పరిశీలించినా.. ప్రత్యేక ప్యాకేజీ రగడను ఒకసారి నెమరువేసుకున్నా.. ఉద్ధానం కిడ్నీ బాధితుల గోడుపై జరిగిన ఆందోళన ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లినా.. తాజాగా అగ్రిగోల్డ్ అగ్గి అధికారపక్షాన్ని దహించివేస్తున్న విషయమైనాసరే.. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో ప్రతీ సమస్యా, ప్రతిపక్షాల ఆందోళన పక్కదారిపట్టాయని బల్లగుద్ది మరీచెప్పొచ్చు.. సినిమాలతో బిజీగా ఉంటూ ప్రజా సమస్యలు పట్టకుండా తిరిగే జనసేనాని అప్పుడప్పుడు ట్విట్టర్ పలుకులతో మైహూనా అనిపిస్తుంటాడు.. వెర్రి వెయ్యివిధాలు అన్నట్లు ఆయన అభిమాన సంఘాలు ఆహా.. ఓహో.. అంటూ అదే సొషల్ మీడియా వేదికగా బాకాలు ఊదుతూనే ఉంటాయి.. ప్రతిపక్షాలు ఏదైనా సమస్యపై రోడ్డెక్కి ఆందోళన చెపట్టడమే ఆలస్యం ట్విట్టర్ రాయుడు కాస్తా గబ్బర్‌సింగ్ సినిమాలో హీరోలా వచ్చేస్తాడు.. మా మంచి చంద్రబాబును ఇబ్బంది పెడుతున్నారని అనుకుంటాడో ఏమో కానీ డొంకతిరుగుడుగా సమస్యను డొంకదారిపట్టిస్తాడు.. ప్రశ్నించేందుకు వచ్చానంటూ ప్రతిపక్షాల ఆందోళనను హైజాక్ చేసి ప్రజలను మాయచేస్తాడు.. అటు బాబు గారు సైతం అంతే డ్రమటిక్‌గా నువ్వొస్తే నేనొద్దంటానా? నువ్వు చెబితే నేను కాదంటానా? అంటూ డ్యూయెట్ పాడుకుంటూ కంటితుడుపు ప్రకటనలు చేసేస్తాడు.. ఇందుకు అమరావతి భూరగడ, కాపు సంఘాల ఆందోళన, ఉద్దానం సమస్యలనాటి పరిణామాలే నిదర్శనం.. తాను ప్రశ్నిస్తేనే ప్రభుత్వం దిగి వచ్చిందనే కలరింగ్ ఇస్తూ అధికారపక్షాన్ని సేఫ్ జోన్‌లో పడేస్తున్నాడు.. ఆపై తన పార్ట్‌ షూటింగ్ అయిపోగానే వెళ్లిపోయేలా హీరోలా పొలిటికల్ సీన్‌లోనుంచి సినిమాజో‌న్‌లోకి జంప్ చేస్తున్నాడు.. అందుకే .. అందుకే.. అందుకే.. పీకే అంటే పవన్ కళ్యాణ్ కాదు ప్యాకేజీ కళ్యాణ్.. బాబు పవర్‌ను కాచే కళ్యాణ్ అంటోంది ప్రతిపక్షం..మరి పీకే సారూ… మీరేమంటారు? అవునంటారా? కాదంటారా? నారా బాబును అడగమంటారా? కాస్త చెప్పరూ..
<script async src="//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script>
<!-- cryddogs -->
<ins class="adsbygoogle"
     style="display:block"
     data-ad-client="ca-pub-6958761900641456"
     data-ad-slot="9613162221"
     data-ad-format="auto"></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});

</script>

No comments