మూలిగే ఆర్టీసిపై కేశినేని కాయ..
అసలే నష్టాలతో కునారిల్లుతున్న ఆర్టీసీపై కేశినేని ట్రావెల్స్ భారాన్ని మోపే యోచనలో ఏపీ సర్కార్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. విజయవాడ ఎంపీ కేశినేని నానికి ఇటీవల తన ట్రావెల్స్‌ను వివాదాస్పద రీతిలో మూసివేసిన విషయం తెలిసిందే.. ఐతే తనదగ్గరున్న బస్సులను ఆర్టీసీకి హైర్ చేసే వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.. ప్రస్తుతం కేశినేని ట్రావెల్స్ వద్ద దాదాపు 170 బస్సులు ఉన్నాయి. కండిషన్‌లో ఉన్న ఏసీ బస్సులు సుమారు 100 వరకు ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన ఇవ్వాలని ఆయన ప్రతిపాదించినట్లు సమాచారం. అందుకు ఆయన వ్యూహాత్మకంగా ఆరు నెలల కిందట నుంచే పావులు కదుపుతున్నట్లు కూడా అధికారవర్గాల సమాచారం..
ప్రైవేటికరణ ప్రమాదం
నానీ ఎత్తుగడలు, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై ఆర్టీసీ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.. ఇది ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం వేస్తున్న ఎత్తుగడే అంటున్నాయి.. అద్దె బస్సుల భారంతో ఆర్టీసీ మరింతగా నష్టాల్లో కూరుకుపోతుందని, అది చివరగా ఆర్టీసీ ప్రైవేటీకరణకు దారితీసే ప్రమాదం ఉందని కలవరపడుతున్నారు..
No comments