క్లాసైనా.. మాసైనా…మడతెట్టేస్తాడు
ఒక లాలన ఒక దీవెన సడి చేయవ యద మాటున ….
భాస్కరభట్ల రవి కుమార్ టాలీవుడ్ గేయ రచయితల్లో తనదైన బాణీ వున్న రచయిత. సినిమా పాటను మాటలు గా రాయగల నేర్పరి . సరికొత్త ప్రయోగాలకు సిసలైన నిర్వచనం . పామరుఁడు నుంచి పండితుడి వరకు అర్ధమయ్యే పాటలు నేటి సినితరం లో కనుమరుగువుతున్న దశలో నిజంగా సాహిత్యాన్ని బతికించే సినిమా ఎవరన్నా తీస్తే పాటకు స్వేచ్ఛే ఇస్తే నేనున్నా అంటూ సాహితీ ప్రియుల ఆశా దీపంలా ప్రస్థానం సాగిస్తున్న కవి . మారుతున్న కాలానికి అనుగుణంగా తెలుగు ఇంగ్లిష్ హిందీ మిక్స్ లాంగ్వేజ్ మాట్లాడుతున్న నేటి యువతరం నాడి పట్టుకున్న అరుదైన రచయిత భాస్కరభట్ల . నీ కళ్ళ లోకి నా కళ్ళతోనే చూస్తేనే చంద్రోదయం అంటూ తులసి సినిమాలో రాసినా , మగాళ్లు వట్టి మాయ గాళ్ళు అంటూ గోలీమార్ లో ఆడవాళ్ళకి మగవారిపై అంతరంగంలో వుండే వేదన వల్లించినా , ఓయి శంకర వీళ్ళ బుద్ధి వంకర అంటూ మగ జాతి ఆడవారిపై అనుకునే సెటైర్లు కలిపి రాసినా , ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే అంటూ పోకిరి చిత్రంలో ఆడవారి మనోభావాలు అరవై ఏళ్ళు వచ్చినా వారికుండే కోరికలు పేరుకి ఐటం సాంగ్ అయినా అద్భుతంగా రాశారు రవికుమార్ . ఐటం సాంగ్ లపై ఐటం సాంగ్ రాస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన రావడం వచ్చిందే టెంపర్ చిత్రం లో నేలా బెంచ్ క్లాస్ కి అంటూ అదరగొట్టే పాట కు భాస్కరభట్ల ప్రాణం పోశారు .

నేస్తమా నేస్తమా నువ్వు కొయిలై పాడతానంటే … తోటగా మారనా నీ కోసం … అంటూ నాగార్జున ఢమరుకం లోను ఆ మధ్యన విడుదలైన సోగ్గాడే చిన్ని నాయనా లో డిక్క డిక్క డుం డుం … అటు క్లాస్ నుంచి మాస్ కి కనెక్ట్ అయ్యే సాంగ్స్ ఏదైనా తన కలానికి సాధ్యమేనని , కాలంతో తన కలం పోటీ పడుతుందని సత్తా చాటి చెప్పాడు భాస్కరభట్ల . కత్తి మీద సాములా సాగే పాటలను చక్కని రీతిలో తనదైన శైలీలో అల్లుకుపోయేలా ప్రేక్షకులకు హత్తుకు పోయేలా రచించడం రవికుమారుని సొంతమే .
తలదించుకు బతుకుతావ తలయెత్తుకు తిరగలేవా అంటూ కెమెరామెన్ గంగతో రాంబాబు లో , గాల్లో తేలినట్లుందే గుండె జారినట్లుందే అంటూ ఆయన కలం జల్సా చేసినా భాస్కరునికే చెల్లింది . చాలా మంది అవి రాయలేదా ఇవి రాయలేదా అని రవి ని అడుగుతూ వుంటారు కానీ తనకు అవకాశం వస్తే ఎలాంటి పాట అయినా చితక్కొట్టడమే ఆయనకు అలవాటు అని తక్కువ మందికే తెలుసు. వెండితెర ఆకాశమే హద్దుగా చిన్న సినిమా పాట అయినా పెద్ద బ్యానర్ చిత్రం అయినా రవి చూపించే శ్రద్ధ చేసే కసరత్తు ఒక్కటే . ఇలా వుండే అతి కొద్ది మంది రచయితల్లో ఆయనొకరు .
భాస్కరభట్ల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది …
ఇక గెలుపే ప్రాతిపదికగా అవకాశాలు లభించే వెండితెర పరిశ్రమలో స్థానం సంపాదించడం , అలా సంపాదించాకా నిలదొక్కుకుని పై పై కి ఎదగడం చాలా కష్టమైన పని . కానీ దాదాపు రెండు దశాబ్దాల నుంచి భాస్కరభట్ల క్రమక్రమంగా పైమెట్లు ఎక్కుతూనే సాగడం ఆయన కృషి , పట్టుదల , క్రమశిక్షణ , వృత్తి నిబద్ధత , అంకితభావాలకు, నిదర్శనమని చెప్పాలి . కెరియర్ ఆరంభంలో అనేక ఆటుపోట్లు ఎవరి మద్దత్తు లేకుండా కేవలం ప్రతిభని నమ్ముకుని పోరాడుతూ పైకొచ్చారు భాస్కరభట్ల . కృష్ణా నగర్ మామ పాట ఇప్పటికి టాలీవుడ్ గీతం గా మారేలా ఆయన రాశారు అంటే ఆ కష్టాలు నష్టాలు చవి చుసిన ఫలితమే .సక్సెస్ అంత ఈజీ కాదు ఒక్కసారి అది సొంతం అయితే అది నిలబెట్టుకోవడానికి రచయిత అయినా , నటుడైన ఇండస్ట్రీ లో వున్న ప్రతి ఒక్కరికి అత్యంత కష్టమైన పనే . ఒక దశకు చేరుకున్నాకా వుండే వత్తిడి దిశ మారుస్తూ నిత్య సంఘర్షణ సాగిస్తూ పయనం చేయడం లో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి .అందులో కూడా విజయవంతంగా సాగుతున్నారు రవి కుమార్ . దానికి కారణం ఆయన దైనందిన జీవితం చక్కగా మలుచుకోవడమే .
ఉదయం లేవడం వాకింగ్ చేయడం , తేనే నిమ్మరసం వేడినీళ్లు తాగడం , ఒక గంట పేపర్లు చదవడం , రేడియో వినడం , ప్రపంచ వ్యాప్తంగా వచ్చే సంగీతాన్ని తన ఆఫీస్ రూమ్ లో వినడం నచ్చిన టిఫిన్ తినడం , మధ్యాహ్నం మెనూ ముందే చెప్పడం, రాత్రి డిన్నర్ కు ముందే మెనూ , నెల రోజుల షెడ్యూల్ ముందే ప్రిపేర్ చేసుకోవడం , ఆ సమయంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా తన కార్యాచరణ మార్చకుండా సాగడం . భార్యా , పిల్లలతో ఉల్లాసంగా వీకెండ్ ప్లానింగ్ , ఆర్ధిక అంశాల్లో చక్కటి ప్రణాళిక రాబోయే ఏళ్లకు కూడా ఆలోచించడం , చిన్న శబ్దం కూడా లేకుండా వుండే వాతావరణం , సంగీతంతో వుండే వాతావరణాన్ని, ప్రకృతిని ప్రేమించడం, ఖాళీ సమయాల్లో లాంగ్ డ్రైవ్ కి ఒక్కడే వెళ్లడం ఇష్టమైన ఆహరం మితంగా తినడం , అన్ని రుచులను ఆస్వాదించడం , ఇలా అనేక సుగుణాలను పుణికి పుచ్చుకోవడం తో పాటల సాగు సేద్యం ఆయనకు హాయిగా సాగిపోతుంది .
జ్ఞాపకాలు , తీపిగురుతులు అంటే రవికి చాలా ఇష్టం . బాగా వత్తిడికి గురయ్యే పని వున్నా , లేదా ఖాళీగా వుండే అవకాశాలను వున్నా చిన్న నాడు తిరిగిన ప్రేదేశాలకు వెళ్లి జ్ఞాపకాలను తీపి గుర్తులను నెమరు వేసుకోవడం రవికి రివాజు . ఆ జోష్ తో ఆయన పాటలు మొదలు పెడితే ఇక ఆ కలం దూకుడే వేరుగా వుంటుందంటారు రవి . ప్రస్తుత గేయ రచయితల్లో రవిలా రిలాక్స్ గా వృత్తిని ఆస్వాదిస్తూ సాగే వారు బహు అరుదనే చెప్పాలి ….

No comments