1

Breaking News



‘లిటిల్‌ మాస్టర్‌’ డాక్యుమెంటరీ




మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్ లైఫ్ ఆధారంగా రూపొందించిన లిటిల్ మాస్టర్ డాక్యుమెంటరీని ఈ నెల 23న సోనీ ఈఎస్‌పీఎన్ ఛానల్ ప్రసారం చేయనుంది.. సచిన్ 44వ జన్మదినం సందర్భంగా ఈ ప్రత్యేక చిత్రాన్ని గౌతమ్ చోప్రా దర్శకత్వంలో నిర్మించారు.. సచిన్ క్రికెట్‌ కెరీర్‌ ఆరంభం నుంచి 2011 వన్డే ప్రపంచకప్‌ వరకు జరిగిన సంఘటనలు ఇందులో కనిపించనున్నాయి.. భారత జట్టుకు సుదీర్ఘ కాలం సేవలందించిన సచిన్‌కు ప్రపంచకప్‌తో వీడ్కోలు పలికేముందు ఆటగాళ్లు భావోద్వేగానికి గురైన తీరు ఈ చిత్రంలో చూపించనున్నారు. 1989లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సచిన్, తన కెరీర్‌లో మొత్తం వంద శతకాలను సాధించాడు.. 1989 నుంచి 2013 వరకు 200 టెస్టులు ఆడి ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు.

No comments