1

Breaking News



ఓలా క్యాబ్ ఎక్కితే 149 కోట్ల బిల్లు..




సాధారణంగా క్యాబ్ సర్వీసులు సిటీస్‌కే పరిమితం.. సిటీ మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికెళ్లినా మహా అయితే వేలల్లో బిల్లు వస్తుంది. కానీ ముంబైలో ఓ వ్యక్తికి ఓలా క్యాబ్ ఏకంగా 149 కోట్లరూపాయల బిల్లు పంపించింది.. ఏప్రిల్ 1న అలా రావడంతో ముందు ఫూల్ చేస్తున్నారని అనుకున్నాడా వ్యక్తి.. కానీ డబ్బు కట్టాలంటూ మెస్సేజ్ రావడంతో అవాక్కయ్యాడు..

                                


300 మీటర్లు.. 149 కోట్లు..

ఏప్రిల్‌ 1న సుశీల్‌ నర్సియాన్‌ అనే వ్యక్తి ముంబైలో ములుంద్‌ వెస్ట్‌ నుంచి వకోలా మార్కెట్‌కి వెళ్లేందుకు క్యాబ్‌ బుక్‌ చేసుకున్నాడు. క్యాబ్‌ డ్రైవర్‌ గూగుల్‌ మ్యాప్‌ సాయంతో ములుంద్‌వెస్ట్‌లోని అతని ఇంటిని గుర్తించడంలో విఫలమయ్యాడు. దీంతో సుశీల్‌ తన ఫోన్‌లోని గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా క్యాబ్‌ ఆగి ఉన్న చోటికి వెళ్లి క్యాబ్‌ ఎక్కాడు. కొంతదూరం వెళ్లాక క్యాబ్‌ డ్రైవర్‌ రైడ్‌ను క్యాన్సిల్‌ చేస్తున్నట్లు తెలిపాడు. దీంతో సుశీల్‌ మరో క్యాబ్‌ను బుక్‌ చేసేందుకు ప్రయత్నించగా రూ.1,49,10,51,648 బిల్లు కట్టాల్సి ఉన్న కారణంగా మరో క్యాబ్‌ బుక్‌ చేసుకునే సౌకర్యం లేదనే మెస్సేజ్ రావడంతో షాక్ తిన్నాడు.. అంతేకాదు సుశీల్‌ ఓలా మొబైల్‌ వ్యాలెట్‌ నుంచి 127 రూపాయలు కట్ చేసుకొని మిగిలిన బకాయీ త్వరగా చెల్లించాలంటూ మరో మెస్సేజ్ కూడా వచ్చింది..  వాస్తవంగా తన బుకింగ్ 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది.. కానీ క్యాబ్ డ్రైవర్‌ రైడ్‌ క్యాన్సిల్ చేసే సమయానికి ప్రయాణించింది కేవలం 300మీటర్లే.. దీనికే రూ.149కోట్లు బిల్లా అని అవాక్కైన సుశీల్‌ వెంటనే ఓలా సర్వీసు కేంద్రాన్ని ఆశ్రయించాడు.. టెక్నికల్ సమస్య అంటూ సుశీల్‌కు సమాధానమిచ్చారు ఓలా సర్వీస్ సెంటర్ సిబ్బంది.. దీంతో వూపిరి పీల్చుకున్నాడు సుశీల్..

No comments