ఆడజన్మే...నీకు శాపమా..?..?
ఆడజన్మే...నీకు శాపమా..?..?
పురిటి గర్భం చీల్చి తల్లి పేగును తెంచి పుడమి ఒడిని చేరావు...!
పీక నులిమి చెత్తకుప్పలకూ...కాట్ల కుక్కలకూ బలికాకుండా... బ్రతికి బట్టకట్టావు..!!
కానీ.....
ఈడొచ్చిన కన్నె పిల్లవని నడివీధిన మృగాళ్ళ కామ కోరల చిక్కి పైశాచకానికి పసిమొగ్గలా నలిగావు...!!
కోరికొచ్చిన గుంట నక్కను కాదు పొమ్మన్నావని కుతుక తెగిన కోడిపిల్లవయ్యావు...!!
ఆశలతో అడుగుపెట్టిన మెట్టినింట అత్తమామల ఆరళ్ళకు ఆహుతయ్యావు.,!!
ముచ్చటంతా మూడు రాత్రులే...
మురిపమంతా మూడు రోజులే...
కనురెప్ప లేపినా...అనుమానం
పాలవాడు పిలిచినా...అనుమానం
అనుమానం...అనుమానం....!!
తాళి కట్టిన ఆలివే కాని ఆశ తీర్చుకునే ఆటబొమ్మవయ్యావు...!!
బ్రతుకు పంచుకునే భర్త రాకాసి రాజ్యానికి
అనుక్షణము ఆరని కన్నిటి ధారల రారాణివయ్యావు...!!

ఇది నిజంగా శాపమేనా...?ఆడజన్మకు శాపమేనా...??
ఆడదంటే అరువు తెచ్చుకున్న అంగడి బొమ్మలా చూస్తూ... పురిటి నొప్పులెరుగని ఈ మృగ మహారాజులున్నంతవరకూ ఈ ఆడ బ్రతుకులు ఇంతేనా...??!!

@...సు..భాషి...@
No comments