1

Breaking News

మరచిపోకు...

మరచిపోకు...
మరచిపోకు అందమైన నీ బతుకు వెనుక శ్రమజీవుల చెమట చుక్కలు మరచిపోకూ...!!
మరచిపోకు...కడుపు నిండిన నీ ఆకలి వెనుక
కడుపు మాడిన కర్షకుల కష్టాలను మరచిపోకు...!!
మరచిపోకు వన్నెతెచ్చే నీ..వలువల వెనుక నేతన్నల రెక్కలకష్టం మరచిపోకు..!!
నిన్ను పెంచిన అమ్మ ఒడినీ...
నడక నేర్పిన నాన్న తోడుని....
నీవు నడిచిన నేలతల్లిని..మరచిపోకు మరువబోకు...!!
మరల మరల మరచిపోకు...ప్రపంచమే నీవు కాదు పదిమందిలొ నిన్ను చూడు...!!
తోటి మనిషే...కాటిదాకా...కలిసొచ్చునని మరచిపోకు...!!
@...సు..భాషి...@

No comments