1

Breaking News

వినూత్నమైన ఆలోచనల ద్వారా యవ్వనోత్తేజ, శక్తివంతమైన ప్రజా నాయకుడిగా శ్రీ నరేంద్ర మోడీ

దక్షిణ గుజరాత్‌‌లోని మెహసానా అనే జిల్లాలోని వాద్ నగర్ అనే చిన్న పట్టణంలో సెప్టెంబర్ 1950న శ్రీ నరేంద్ర మోడీ జన్మించారు. పుట్టుకతోనే ఒక సంస్కృతిలో పెరిగిన శ్రీ నరేంద్ర మోడిలో దాతృత్వం, దయ, సామాజిక సేవా గుణాలను అలవర్చుకున్నారు. 1960లో భారత్-పాక్ మధ్య జరిగిన యుద్దం సమయంలో కుర్రాడిగా శ్రీ నరేంద్ర మోడీ సైనికులకు వాలంటరీగా పని చేశారు. 1967వ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రం మొత్తం వరదలతో అతలాకుతలమైనప్పుడు బాధితులకు తన వంతు సేవలను అందించారు. గుజరాత్‌లో అఖిల భారతీయ విద్యార్ది పరిషత్ ఆధ్వర్యంలో వివిధ సామాజిక రాజకీయ ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించారు.
తన బాల్యం నుంచే శ్రీ నరేంద్ర మోడీ అనేక అసమానతలను, అడ్డంకులను అధిగమించారు. వ్యక్తిత్వ బలంతో, ధైర్యంతో అవకాశాలను సవాళ్లుగా మార్చుకున్నారు. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం కాలేజీ, యూనివర్సిటీలో చేరినప్పుడు కఠినమైన పోరాటాలు చేయాల్సి వచ్చింది. కానీ జీవన సమరంలోఆయన ఎల్లప్పుడూ ఒక నిజమైన సైనికుడుగా ప్రవర్తించారు. అడుగు ముందుకు వేసిన తర్వాతా మళ్లీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవడానికి లేదా ఓడిపోవడానికి నిరాకరించాడు. ఇదే ఆయనను రాజకీయ శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేందుకు విధించుకున్న కట్టుబాటు. భారతదేశ సామాజిక, సాంస్కృతిక అభివృద్ధి కోసం స్దాపించిన సామాజిక సాంస్కృతిక సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో ఆయన పయనం మొదలైంది. దేశం పట్ల నిస్వార్ధ సేవ, సామాజిక బాధ్యత, అంకితభావం, జాతీయతా స్ఫూర్తిని పెంపొందించుకోవడానికి ఇది దోహదపడింది.
ఆర్ఎఎస్ఎస్‌లో చేస్తూ, శ్రీ నరేంద్ర మోడీ పలు సందర్భాల్లో, ముఖ్యంగా 1974 నవనిర్మాణ్ అవినీతి వ్యతిరేక ఆందోళనలో, 19 నెలల అత్యవసర పరిస్థితిలో (జనవరి 1977 జూన్ 1975) భారత పౌరుల ప్రాథమిక హక్కులను గొంతునులిమినప్పుడు సాగిన పోరాటంలో ఆయన కీలకమైన పాత్రలను పోషించారు. మోడీ అజ్ఝాతవాసానికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ చర్యలకు వ్యతిరేక స్ఫూర్తిదాయకమైన పోరాటం చేసి ప్రజాస్వామ్యం మనుగడ సాగించడానికి కృషి సలిపారు.
1987లో భారతీయ జనతా పార్టీలో చేరడం ద్వారా ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి ప్రవేశించారు. కేవలం ఒక్క సంవత్సర కాల వ్యవధిలోనే గుజరాత్ యూనిట్‌ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ సమయానికే శ్రీ నరేంద్ర మోడీ అత్యంత సమర్థవంతమైన నిర్వాహకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. పార్టీ కార్యకర్తలను బలోపేతం చేసే సవాలును స్వీకరించారు. భారతీయ జనతా పార్టీ రాజకీయంగా పెద్ద శక్తిగా ఎదిగి ఏప్రిల్ 1990లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ భాగస్వామ్యం కొన్ని నెలలకే పరిమితమైనప్పటికీ.. భారతీయ జనతా పార్టీ 1995 లో గుజరాత్ లో సొంతంగా ఒక రెండు వంతుల మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ పాలన ప్రారంభమైంది.
1988, 1995 మధ్య గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవడంలో శ్రీ నరేంద్ర మోడీ చేసిన క్షేత్రస్థాయిలో చేసిన కృషి పనిచేసింది. దాంతో శ్రీ నరేంద్ర మోడీని ప్రతిభావంతమైన వ్యూహాకర్తగా పార్టీ గుర్తించింది. ఈ కాలంలో శ్రీ నరేంద్ర మోడీకి రెండు కీలక జాతీయ కార్యక్రమాలు నిర్వహించే బాధ్యతను అప్పగించారు. ఎల్‌కె ఆద్వానీ సోమనాథ్ నుండి అయోధ్య వరకు చేపట్టిన రథయాత్ర ఒకటి కాగా, కన్యాకుమారి (భారతదేశం దక్షిణ భాగం) నుండి కాశ్మీర్ వరకూ చేపట్టిన యాత్ర రెండోది. శ్రీ నరేంద్ర మోడీ నిర్వహించిన ఈ రెండు అత్యంత విజయవంతమైన కార్యక్రమాలతో 1998లో బిజెపి ఢిల్లీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది.
1995లో శ్రీ నరేంద్ర మోడీని పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమించి, ఆయనకు భారతదేశంలోని ఐదు రాష్ట్రాల బాధ్యతలను అప్పగించారు. ఒక యువ నాయకుడుగా శ్రీ నరేంద్ర మోడీకి దక్కిన అరుదైన గౌరవం ఇది. 1998లో ఆయనకు జాతీయ కార్యదర్శి (ఆర్గనైజేషన్) గా పదోన్నతి లభించింది. ఈ పదవిలో ఈయన అక్టోబర్ 2001 వరకు ఉన్నారు. ఆ తర్వాత భారతదేశంలోని అత్యంత సంపన్న, ప్రగతిశీల రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన పదవీబాధ్యతలు చేపట్టారు. జాతీయ స్థాయిలో ఉన్న సమయంలో, శ్రీ నరేంద్ర మోడీకి సున్నితమైన, కీలకమైన జమ్మూ కాశ్మీర్‌తో సహా ఈశాన్య రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల శాఖలను పర్యవేక్షించే బాధ్యతను అప్పగించారు. ఆ రకంగా ఆయన పలు రాష్ట్రాల్లో పార్టీని పునరుద్ధరించే బాధ్యతను తీసుకున్నారు. పార్టీ జాతీయ స్థాయిలో వ్యవహారాల్లో శ్రీ నరేంద్ర మోడీ కీలకమైన నేతగా ముందుకు రావడమే కాకుండా పలు ముఖ్యమైన సందర్భాల్లో కీలక పాత్ర పోషించారు.
ఈ కాలంలో, శ్రీ నరేంద్ర మోడీ ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి, పలు దేశాల ప్రముఖ నాయకులను కలుసుకున్నారు. ఈ అనుభవాలను ఆయనకు ఒక ప్రాపంచిక దృక్పథాన్ని అందించడమేకాకుండా దేశానికి సేవ చేయాలని, దేశాన్ని సామాజికంగా, ఆర్థికంగా అగ్రగామిగా తీర్చిదిద్దాలనే ఆసక్తిని ఇనుమడింపజేసింది.
అక్టోబర్ 2001 లో, పార్టీ ద్వారా శ్రీ నరేంద్ర మోడీ గుజరాత్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా పిలుపును అందుకున్నాడు. శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా అక్టోబర్ 7, 2001న ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, జనవరి 2001 లో వచ్చిన భారీ భూకంపాలు మరియు అనేక ప్రకృతి వైపరీత్యాలు, దుష్ప్రభావాల కారణంగా గుజరాత్ ఆర్థిక వ్యవస్థ క్రిందకి దిగజారింది. అయితే జాతీయ మరియు అంతర్జాతీయ అనుభవం ద్వారా శ్రీ నరేంద్ర మోడీ ఒక మాస్టర్ వ్యూహాకర్తగా మంచి నిర్ణయాలు తీసుకున్నారు.
ముఖ్యమంత్రి పదవిని గుజరాత్ ప్రభుత్వాన్ని నడిపించాలని శ్రీ నరేంద్ర మోడీని ఆదేశించింది. మోడీ 2001 అక్టోబర్ 7వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేనాటికి గుజరాత్ 2001 జనవరిలోని భారీ భూకంపంతో పాటు పలు ప్రకృతి వైపరీత్యాల తాకిడితో విలవిలలాడుతోంది. జాతీయ, అంతర్జాతీయ అనుభవాలను ప్రోది చేసుకున్న శ్రీ మోడీ వాటిని సమర్థంగా ఎదుర్కున్నారు.
2001 జనవరి భూకంప తాకిడి ప్రాంతాల్లో పునరావాస, పునర్నిర్మాణ కార్యక్రమాలు సవాల్‌గా నిలిచాయి. భూకంపానికి భుజ్ తీవ్రంగా దెబ్బ తిన్నది. వేలాది మంది మౌలకి సదుపాయాలు లేని పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. దయనీయమైన స్థితిని సంపూర్ణ అభివృద్ధి కిందికి ఎలా మార్చారో నేడు భుజ్ ఒక ఉదాహరణగా నిలుస్తుంది.
పునరావాస, పునర్నిర్మాణ కార్యక్రమాలు సాగిస్తూ శ్రీ నరేంద్ర మోడీ అతిపెద్ద దృశ్యానికి సంబంధిచంచిన దృష్టికోణాన్ని కలిగి ఉన్నారు. సమీకృత సామాజిక, ఆర్థిక ప్రగతికి శ్రీ నరేంద్ర మోడీ సామాజిక రంగాలపై దృష్టి సారించి అసమతౌల్యాన్ని తొలగించాలని నిర్ణయించుకున్నారు. అందుకు ఆయన పంచామృత యోజన అనే పంచముఖ వ్యూహాన్ని రూపొందించారు.
ఆయన నాయకత్వంలో గుజరాత్ విద్య, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ వంటి వివిధరంగాల్లో భారీ మార్పులను చూసింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం తనదైన స్పష్టమైన దృష్టికోణంతో విధానపరమైన సంస్కరణా కార్యక్రమాలను ప్రారంభించారు, ప్రభుత్వ పాలనా వ్యవస్థను తీర్చిదిద్దారు. తద్వారా గుజరాత్‌ను సంపన్నమార్గంలో పెట్టారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల లోపలే ఆయన లక్ష్యాలకు, సమర్థతకు గుర్తింపు లభించింది. మోడీ పాలనా సమర్థత, స్పష్టమైన దృక్పథం, వ్యక్తిత్వ పరిపూర్ణత లకు ఆయన నైపుణ్యం తోడై 2002 డిసెంబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయాన్ని సాధించి పెట్టాయి. 182 అసెంబ్లీ స్దానాలున్న గుజరాత్ శాసనసభలో 128 స్దానాలను శ్రీ నరేంద్రమోడీ కైవసం చేసుకున్నారు. ఇదే విజయ పరంపర 2007 ఎన్నికల్లో పునరావృతమై మళ్లీ గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది.
శ్రీ నరేంద్ర మోడీ 2012 సెప్టెంబర్ 17న గుజరాత్ ప్రజలు సేవలో 4000 రోజులు రికార్డును పూర్తి చేశారు. మూడు వరుస ఎన్నికల్లో నరేంద్ర మోడీని గుజరాత్ ప్రజలు ఆశీర్వదించి, అధికారాన్ని కట్టబెట్టారు. 2002, 2007 ఎన్నికల్లో(117 సీట్లు) గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించిన శ్రీ నరేంద్ర మోడీ, 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో(115 సీట్లు) తన జోరును కొనసాగించారు. డిసెంబర్ 26, 2012వ తారీఖున వరుసగా నాల్గవసారి గుజరాత్ ముఖ్యమంత్రిగాప్రజా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రజా ఆకాంక్షలు అంచనాలకు మించి నెరవేరాయి. ఇ-పాలన, పెట్టుబడులు, పేదరిక నిర్మూలన, శక్తి, సెజ్‌లు, రహదారి అభివృద్ధి, ఆర్థిక క్రమశిక్షణ తదితర రంగాల్లో గుజరాత్ దేశాన్ని ముందుకు నడిపిస్తోంది. అభివృద్ధి ఏదో ఒక రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. మూడు రంగాలు (వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు) అభివృద్ధి చెందాయి. గుజరాత్ అనూహ్యమైన అభివృద్ధి వెనక సబ్‌కా సాథ్ (అందరితో పాటు), సబ్‌కా వికాస్ (అందరి అభివృద్ధి) అనే మోడీ మంత్రమే కాకుండా ప్రజానుకూల, రాష్ట్ర ప్రగతిలో ప్రజలను భాగస్వాములను చేసిన క్రియాశీల ఉత్తమ పాలన (పి2జి2)లకు ఇచ్చిన ప్రాధాన్యం ఉన్నాయి.
ఆటంకాలకు ఎదురొడ్డి నర్మదా ఆనకట్టను 121.9 మీటర్లకు పెంచారు. దానికి ఆటంకాలు కల్పిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా ఆయన నిరాహార దీక్ష కూడా చేపట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత గుజరాత్‌లో నీటి వనరుల గ్రిడ్ సృష్టించడానికి "సుజలాం సుఫలాం" పేరుతో ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. శ్రీ నరేంద్ర మోడీ నీటి సంరక్షణ మరియు తగిన వినియోగం వైపు తీసుకున్న మరొక నూతన అడుగు ఇది. వీటితో పాటు గుజరాత్‌లోని సామాన్య ప్రజల కోసం ఆరోగ్య కార్డులు, రోమింగ్ రేషన్ కార్డులు, రోమింగ్ స్కూల్ కార్డులను అందించారు. గుజరాత్ బహుముఖ ప్రగతికి కృషి మహోత్సవ్, చిరంజీవి యోజన, మాతృ వందన, బేటీ బచావో క్యాంపెయిన్ (బాలికలను రక్షించండి), జ్యోతిగ్రామ్ యోజన, కర్మయోగి అభియాన్, ఈ-మమత, ఇఎ పవర్, స్కోప్, ఐక్రియట్ లాంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. రానున్న ఎన్నికల గురించి మాత్రమే ఆలోచించే నాయకులు ఉన్న ప్రస్తుత తరుణంలో శ్రీ నరేంద్ర మోడీ భవిష్యత్తు తరాల కోసం ఆలోచించే దార్శనికత, దృక్పథం, నిర్ణీత కాలపరిమితిలో అమలు చేసే కార్యాచరణ వంటిద్వారా నిజమైన పాలనాదక్షుడిగా నిలిచారు.
వినూత్నమైన ఆలోచనల ద్వారా యవ్వనోత్తేజ, శక్తివంతమైన ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందిన శ్రీ మోడీ గుజరాత్ ప్రజలకు తన దృక్పథాన్ని అర్థం చేయించడంలో విజయం సాధించారు. ఆరు కోట్ల గుజరాత్ రాష్ట్ర ప్రజల్లో విశ్వాసాన్ని, ఆశను ప్రోదిచేసి పెట్టారు. తన అపారమైన జ్ఝాపకశక్తితో లక్షలాది మందిని, సామాన్యులను కూడా వారి మొదటి పేర్లతో సంబోధించే గుణం ఆయనను ప్రజా నాయకుడిగా నిలిపింది. ఆధ్యాత్మిక గురువుల పట్ల ఉన్న అపారమైన గౌరవభావం మతాల మధ్య సంబంధాలను పెంపొందించడానికి పనికి వచ్చింది. ఆదాయ గ్రూపులకు, మతాలకు, రాజకీయ అనుబంధాలకు అతీతంగా విభిన్నమైన సామాజిక శ్రేణులు శ్రీ నరేంద్ర మోడీని తమ జీవితాలను పారదర్శకంగా, విశ్వసనీయమైన రీతిలో మెరుగుపరిచే దార్శక నేతగా అభిమానిస్తాయి. నైపుణ్యం గల వక్త, తెలివిగల సంధానకర్త కావడంతో శ్రీ నరేంద్ర మోడీని నగర, గ్రామీణ ప్రజలు ఒకే రీతిలో ప్రేమిస్తారు. సమాజంలోని ప్రతి విశ్వాసానికి, ప్రతి మతానికి, ప్రతి ఆర్థిక స్థితికి చెందిన ప్రజలను ఆయనకు అనుచురులు ఏర్పడ్డారు.
శ్రీ నరేంద్ర మోడీ సారథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా గుజరాత్ అనేక అవార్డులను సొంతం చేసుకుంది. వీటిలో ముఖ్యమైనవి విపత్తు తగ్గింపు విభాగంలో యునైడెట్ నేషన్స్ ససకావా అవార్డు, పరిపాలనలో నూతన ఒరవడి సృష్టించినందుకు కామన్‌వెల్త్ అసోసియేషన్ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ (CAPAM) అవార్డు, యునెస్కో అవార్డు, ఈ-గవర్నెన్స్ విభాగంలో సీఎస్ఐ అవార్డు మొదలైనవి. ప్రజల ఆరాధ్య ముఖ్యమంత్రుల్లో శ్రీ నరేంద్ర మోడీ వరుసగా మూడు సంవత్సరాలు మొదటి స్దానంలో నిలిచారు. ప్రపంచ చిత్రపటంలో గుజరాత్‌కు స్పష్టమైన స్దానాన్ని కల్పించడం కోసం నిర్వహించిన క్యాంపెయిన్ 'వైబ్రెంట్ గుజరాత్'. 2013 వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 120 దేశాలు పాల్గోన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు.
చాలా ఏళ్లుగా గుజరాత్ రాష్ట్రం రెండంకెల వృద్ది రేటుని నమోదు చేస్తోంది. గుజరాత్ పెరుగుదల, అభివృద్ధి పథంలో వేగాన్ని పెంచుకుంటూ కాలం అడుగుజాడలను వదులుతూ, మైలురాయిని మరో మైలురాయిగా మలుచుకుంటూ, అడుగడుగు ముందుకు వేస్తూ తన ప్రయాణాన్ని అలసట లేకుండా సాగిస్తోంది.
రాజకీయాల్లో క్షేత్ర స్థాయి నుంచి ఉన్నత స్థితికి ఎదిగిన ప్రయాణాన్ని విహంగావలోకనం చేస్తే నాయకుడిగా నరేంద్రమోడీ వ్యక్తిత్వ వికాసం గురించి అధ్యాయాల కొద్ది చెబుతుంది.
శ్రీ నరేంద్ర మోడీ ఆలోచనలు, ఆదర్శాల నాయకత్వం కారణంగా యువత ఆయనను ఒక క్లాసిక్ రోల్ మోడల్‌గా భావిస్తుంది. మోడీ వ్యక్తిత్వ బలం, సాహసం, అంకితభావం, దార్శనికత సృజనాత్మక నాయకత్వం ఎలా వికసిస్తుందో తెలియజేస్తుంది. ప్రజా జీవితంలో విశేషమైన సేవాతత్పరత, ప్రయోజనకరమైన ఆచరణ గల, తాను ప్రేమించే ప్రజల ప్రేమను పొందగలిగిన ఇలాంటి నాయకుడు ప్రజాజీవితంలో కనిపించడం అరుదు.

No comments