అమెరికా తెలుగు సంఘం
వాషింగ్టన్ : అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో
జులై 3, 4, 5 తేదీల్లో ఫిలడెల్ఫియా నగరంలో నిర్వహించనున్న 13వ ఆటా మహాసభల
నిర్వహణ కోసం, సభల ప్రాముఖ్యాన్ని వివరించేందుకు ఆటా రోజు పేరిట
పిట్స్‌బర్గ్ నగరంలో నిధుల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ
కార్యక్రమానికి 100కు పైగా కుటుంబాలు హాజరై సభల్లో పాల్గొనేందుకు తమ
పేర్లను నమోదు చేసుకున్నాయి. 50 వేల డాలర్లు నిధులుగా అందినట్లు
నిర్వాహకులు తెలిపారు. స్థానిక ప్రవాసాంధ్రుల సాంస్కృతిక కార్యక్రమాలతో
పాటు గాయకులు విజయలక్ష్మి, దీపు, మధుల సంగీత విభావరి అలరించింది.
పిట్స్‌బర్గ్ ఆటా సమన్వయకర్త కొండల రవి ఆధ్వర్యంలో యల్లాప్రగడ శ్రీకాంత్,
కాలే కిరణ్, అమర్ రెడ్డిల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆటా సభల
కార్యవర్గం భీంరెడ్డి పరమేష్, మోసర్ల మాధవ్, పెర్కరి సుధాకర్, ఆసిరెడ్డి
కరుణాకర్, చెమర్ల నరేందర్, సూదిని విక్రం, కొండా రామ్మోహన్, కొండపోలు
వెంకట్, బొజ్జా రవి, బండా ఈశ్వర్‌రెడ్డి, చాడా శ్రీనివాస్ తదితరులు
పాల్గొన్నారు.
No comments