1

Breaking News

పీకే రూ 26.63 కోట్ల వసూలు

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్-అనుష్కశర్మ జంటగా నటించిన చిత్రం పీకే. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి విడుదలయ్యే వరకు ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో విధువినోద్‌చోప్రా ఈ సినిమాను నిర్మించారు. ఇతర పాత్రల్లో సంజయ్‌దత్, బొమన్ఇరాని, సౌరభ్‌శుక్లా తదితరులు నటించారు. తొలి రోజే హిట్ టాక్ తెచ్చుకున్న పీకే రూ 26.63 కోట్ల వసూలు చేసింది. ఇదో రికార్డు. ఈ వసూళ్ల పర్వం ఇలాగే కొనసాగితే రూ.300 కోట్ల మార్క్‌కు త్వరలోనే చేరుకుంటుందని టాలీవుడ్ ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. పీకే దెబ్బకు మరిన్ని రికార్డులు బద్దలవుతాయని బాలీవుడ్‌లో టాక్ మొదలైంది. గత క్రిస్మస్‌కు విడుదలైన అమీర్ ధూమ్-3 కూడా కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. తాజా చిత్రం పీకేలో అమీర్ ఓ గ్రహాంతర వాసిగా నటించారు. కథలో వైవిధ్యం ఉండడంతో బాక్సాపీస్ వద్ద సునామి సృష్టిస్తోంది.

No comments