అక్కినేని నాగేశ్వరరావు అవార్డును బాలీవుడ్ లెజండ్రీ యాక్టర్ బిగ్‌బీ అమితాబచ్చన్‌కు
దివంగత మహానటుడు అక్కినేని
నాగేశ్వరరావు అవార్డును బాలీవుడ్ లెజండ్రీ యాక్టర్ బిగ్‌బీ అమితాబచ్చన్‌కు
ప్రధానం చేయనున్నారు. ఈ విషయాన్ని అక్కినేని కుమారుడు యువసామ్రాట్
నాగార్జున శనివారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమం ఈ నెల
27న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ 7 ఏకర్స్‌లో జరగనుంది. ముఖ్య అతిథిగా తెలంగాణ
సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి
ఎం.వెంకయ్యనాయుడు హాజరు కానున్నారు. నాగ్ కొద్ది రోజుల క్రితం ఈ
కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేయగా
ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ అవార్డు ప్రధానోత్సవం కార్యక్రమంలో అలనాటి
నటి, ప్రముఖ భరతనాట్య కళాకారిణి శోభన ప్రత్యేక ప్రోగ్రాం ఉంటుంది. చిత్ర,
రాజకీయ రంగాలకు చెందిన పలువురు ముఖ్యులు ఈ కార్యక్రమానికి హాజరు
కానున్నారు.
No comments