మాజీ కేంద్రమంత్రి జి.వెంకటస్వామి(92) మృతి
సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు.. మాజీ కేంద్రమంత్రి జి.వెంకటస్వామి(92) మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీలో దళిత దిగ్గజాల్లో ఒకరైన ఆయన కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుంచి రాష్ట్ర, కేంద్ర స్థాయిలో తన రాజకీయ ప్రస్థానం కొనసాగించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. పెద్దపల్లి నుంచి ఏడు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయనకు ఇద్దరు కుమారులు వివేక్, వినోద్ వీరు కూడా రాజకీయాల్లో రాణిస్తున్నారు. వినోద్ రాష్ట్ర మంత్రిగా పనిచేయగా.. వివేక్ ఎంపీగా పనిచేశారు. ముగ్గురు కుమార్తెలు. మాజీ మంత్రి శంకర్‌రావు ఆయనకు స్వయానా అల్లుడు. వెంకటస్వామి రెండు సార్లు కేంద్రమంత్రిగా.. మూడు సార్లు రాష్ట్రమంత్రిగా పనిచేశారు. ఆయన 1957-62,78-84 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. 1967లో తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. అక్కడ నుంచి ప్రారంభించి మొత్తం ఏడుసార్లు ఎంపీగా విజయంం సాధించారు. కాకాగా ఆయన ప్రసిద్ధి. వెంకటస్వామి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు నారా చంద్రబాబునాయుడు, కేసీఆర్‌తో పాటు వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి పలువురు సంతాపం ప్రకటించారు.
No comments