ఏదైనా
అడిగితే...ప్రతిపక్షాన్ని మీ కథ తేలుస్తాం...జాగ్రత్తగా ఉండండి అని
బెదిరిస్తున్నారు. పెద్ద పెద్ద చూపులు చూస్తున్నారు. ఏం చేస్తారండి.
గోదావరికి తీసుకు వెళ్లి నీళ్లలో ముంచేస్తారా? గుంటూరు ఆస్పత్రిలో చేర్చి
ఎలుకలతో కరిపిస్తారా? లేదంటే నారాయణ కాలేజీలో చేర్పించి ర్యాగింగ్
చేయిస్తారా? ఎమ్మార్వో వనజాక్షిని కొట్టినట్లు రౌడీలతో మమ్మల్ని
కొట్టిస్తారా? పోనీ ఏలూరు తీసుకువెళ్లి ఇంజక్షన్ చేయించి చంపిస్తారా? ఎలా
మా అంతు తేలుస్తారో చెప్పండి. ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కాదు... ఇది
అసెంబ్లీ. మేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలం. వైఎస్ రాజశేఖరరెడ్డి
స్ఫూర్తిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రజా సమస్యలపై అలుపెరగని
పోరాటం సాగిస్తాం. సీఎం పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మీ స్థాయిని
దిగజార్చుకోవటం సరికాదు' అని హితవు పలికారు
No comments