నిన్ను విడిచి....
నిన్ను విడిచి-కవి సమయం: 'బిచ్చి' అని ప్రియ మిత్రులు ఆప్యాయంగా
పిలుచుకునే దేవరకొండ భిక్షపతి రాత్రి కన్ను మూశారు. ఆయన మృత్యువుకు
అనారోగ్యం కారణమైనా, తాగి తాగి ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నారని,
స్వయంకృతాపరాధమని ఎవరెన్ని అన్నా, 'నిన్ను విడిచి
ఉండలేనమ్మా...పాటమ్మా'..అని ఆయన పాట మీద రాసినట్లే, ఆయన ప్రేమించి
పెళ్లాడిన సహచరి దూరం కావడమూ ఒక విషాద వాస్తవంగా అతడి సన్నిహితులు అంటారు.
అది ఎంత వరకు నిజమోగానీ, అదే అయితే తన పాట నాకు కొత్తగా వినిపిస్తోంది. ఆ
పాటలోని పల్లవి ఆమెనే అనిపిస్తుంది నాకైతే. ఎవరికైనా , విడిచి వుండలేని
తనమే అతడ్నిరందికి గురిచేసి పాణం పోయేలా అనారోగ్యానికి గురుచేసినట్లయింతే
నిజంగా బిచ్చన్న గ్రేట్. అదే సమయంలో ఒక మాట. మనిషికి తోడు లేనప్పుడు ఎంతటి
ప్రతిభావంతమైన వ్యక్తి అయినా, కళాకారుడైనా కళను మాత్రమే అంటిపెట్టుకుని
జీవించలేడు అనడానికి కూడా బిచ్చన్న జీవితం ఒక విషాద ఉదాహరణ అవుతుంది ఏమైనా,
అతడ్ని కొసవరకూ కాపాడటానికి కృషిచేసిన మిత్రులకు కృతజ్ఞతలు. గద్దరన్నా,
మిట్టపల్లి సురేందర్ వంటి మిత్రులు ఇంకా ఎందరో ఆ పాటగాడికోసం ప్రాణం
పెట్టారు. వారందరికీ వందనాలు. మొత్తానికి ఈ కవి మరణానికి కారణం ఏమిటో అన్న
జడ్జిమెంట్ వదిలేద్దాం. కానీ, చనిపోయింది మాత్రం సత్యం. ఆయన పాట మాత్రం
సుందరం. ఇటీవలి దశాబ్దాలు ముఖ్యంగా తెలంగాణం దేనిమీదనైతే జవించిందో అందుకు
కారణమైన జీవకళ పాట. దానికి అయిన చేసిన సేవ ఎనలేనిది, మరపు రానిది. 'నిన్ను
విడిచి వుండలేనమ్మా...పాటమ్మా' కవిగా గాయకుడిగా తెలంగాణ తల్లి ఈ బిడ్డ
గదువ పట్టుకుని రాయించినట్టు రాయించింది. అది మాత్రం మిగిలింది. ఆర్ట్ ఈజ్
లాంగ్ అనడానికి మళ్లీ బిక్షపతన్న మరణం కారణమైంది. అన్నకు నీరాజనం. తనపై
'కవి సమయం' శీర్షికలో ఒక వ్యాసం రాసిన సోదరుడిగా మిత్రులకు కడసారి ఆయన్ని
మళ్లీ పరిచయం చేస్తున్నందుకు విఛారంతోనే...నా వినమ్ర అశ్రు నీరాజనం.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
కవి సమయం ~ దేవరకొండ భిక్షపతి
పాట మీద పాట రాసిన కవి సమయం ఇది. పాట ఒక రహస్యోద్యమం కావడం, అటెన్క పాట ధూందాం కావడమూ కలగలసిన పాట ఇది. మొత్తంగా ఈ కవి సమయం తెలంగానం.
ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమ సమయంలో కవి పాత్రోచిత సందర్భాన్ని బట్టి వివిధాలుగా రచించిన పాటల్ని ప్రముఖంగా చర్చిస్తే, ఈ వారం మాత్రం అచ్చంగా కవి సమయమే. పాట సమయం. పాటపై పాట రాసిన భిక్షపతి కవి సమయం. ఒక ప్రామిసింగ్ పాట రాసిన కవిగాయకుడి సమయం ఇది.
'నిన్ను విడిచి ఉండలేనమ్మా...ఓ పాటమ్మా'అంటూ పాట వెంటే ఉంటానని ప్రమాణం చేసిన ఒక ప్రామి-స్‌ంగ్ పోయెట్ కవితా సమయం.
మొత్తం తెలంగాణ సమాజంలో ఒక ప్రక్రియగా పాట ఎంత పని చేసిందో, ఎన్నెన్ని విధాలా కాంట్రిబ్యూట్ చేసిందో, అందలి కవితా న్యాయం ఎసొంటిదో పారాయణం చేసే గొప్ప పాట ఇది. ఒక రకంగా తెలంగాణ చైతన్యవంతం కావడానికి ఉపకరించిన అన్ని పాయల్ని, ఛాయల్ని దృశ్యమానం చేసి వదిలిపెట్టే పాట. తెలంగాణ ఈడిదాకా రావడానికి కారణమైన ప్రస్తావనల పాట. అది ఒక్కొక్కర్నీ యాది చేస్తది. ఒరిగిన బిడ్డలు, వాళ్ల ఆశయాలు అన్నీ గుర్తు చేస్తది. ఈ పాట ఒక రకంగా తెలంగాణ ముద్దుబిడ్డలందర్నీ ముద్దాడి, వారిని జాగురూకతలో వుంచే పాట. ఒక చరిత్ర గానం. పాటగాళ్లను సగర్వంగా తలకెత్తుకోవాల్సిన తరుణంలో ఈ పాట ప్రాసంగికత ఇపుడు ఇంకా ఎక్కువ. రాసింది భిక్షపతి.
'ఒకనాడు కొడుకా నా ముద్దుల కొడుకా 'అని పాట రాసి పాడగా వాచ్‌మెన్ ఉద్యోగాన్ని పోగొట్టుకున్న పాటగాడి పాట. పాటే జీవితంగా చేసుకున్న ఒకడి ఉద్యమ కాలం, ఈ 'నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా'...
ఈ పాటను తొలుత నాలుగేళ్ల క్రితం గోదావరిఖనిలో పాడిండట. తర్వాత ధూందాం వేదిక మీద పాడిండు. లలిత కళా తోరణంలో. అంతే. అప్పటినుంచి పాటల వేదికగా ఉన్న ధూందాంకు ఈ పాట బొడ్రాయిగా మారింది. పాటలెన్ని పాడినా పాటపై రాసిన ఈ పాట పాడితేగానీ సభ, ఆ సమావేశం పూర్తికాదు. అందుకు కారణం, మలిదశ ఉద్యమంలో పాటది ఒక ప్రశస్తమైన పాత్రయితే ఆ పాత్రను, దాని సుదీర్ఘమైన, విస్తారమైన చరిత్రను సంక్షిప్తంగా పదమూడు చరణాలతో అల్లి, ఆ పాట నిశ్శబ్ద కృషిని ఇందులో తలచుకోగలగడం. ఒక రకంగా ఇది కార్యకర్తగా మారిన మన సమాజం ఒక్కపరి శ్రోతై వినే పాట. విని ఉప్పొంగే పాట. తమ కృషిని తామే విని సంతసించే పాట.
ఈ పాటలో ప్రముఖ కవిగాయకులను పేర్కొంటూ వాళ్ల కృషిని అపూర్వంగా తల్చుకోవడం ఉన్నది. పాట గాయపడ్డ వైనమూ ఉంది. పాట నూరిపోసిన ధైర్యమూ ఉన్నది. పాట జైలుకు వెళ్లడం ఉన్నది. కడుపులో ఎన్ని తూటాలు పడ్డా కలత చెందని మనసు ఉన్నది. ప్రాంతేతరులు మన పాటను, దాని యాసను, భాషను ధ్వంసం చేసి బాధపెట్టడం పట్ల వేదనా ఉన్నది. రాసిన వాడు గాక ఇంకొకడు పేరు మోసినప్పటి కవి దుఃఖమూ ఉన్నది. పీడనను ఎదిరించించిన పాట కవిత ఇది. ఒక రకంగా పాటకు ముందు మాటలా ఒక కవి కైగట్టడం ఇది. పాటకు సమయం రావడం వల్ల తెలంగాణ తనని తాను ఆప్యాయంగా తడుముకున్న సందర్భం ఈ పాట.
ఇంకా చాలా ఉన్నయి. పాట రైతుల హక్కులను సాకారం చేసేందుకు చేసిన కృషీ ఉన్నది. గులాం గిరీ చేయకుండా నిలదొక్కుకున్న తీరూ ఉన్నది. పాటను అమ్మగా పేర్కొంటూ, పది కాలాల పాటు చల్లగుండమని చెప్పే దీవెనా ఉన్నది. మొత్తంగా తెలంగాణ నడిచి వచ్చిన దారులన్నిటా కలియ తిరుగూతూ ఒక చిరుగాలిలా ప్రారంభమై తుదకు చుట్టేసి, పలు రీతులా హృదయాలు శుభ్రం చేస్తూ ఆర్తితో, ఆవేదనతో, మమతానురాగాల మాలికగా ఈ పాట నడిచినది. అందులో చెప్పుకోతగ్గ వినయమూ విధేయతా ఉన్నది. ఆ లెక్కన ఈ పాట గొప్ప కాంట్రిబ్యూషన్. దీన్ని 'వారం దినాలల్ల రాసిన' అన్నడు భిక్షపతి. అయితే, 'ఎందుకు రాసిన్నో ఒక్క మాటలో చెప్పవశం అయిత లేదు' అన్నడు. కానీ, ట్రై చేసిండు. చెప్పిండు.
'ఆ దినం రాత్రయింది. పాటలు పాడి వస్తున్నరు. తానూ, తన మేనకోడలు అశ్విని. బస్సుల్లేవు. పన్నెండు గొట్టింది. పోలీసులు పట్టుకుంటే పాటలు పాడి వస్తున్నం అన్నరు. వాళ్లు వినలేదు. స్టేషన్‌కు తీస్కపోయిండ్రు. అప్పుడు గద్దర్‌కి, గోరటి వెంకన్నకు ఫోన్లు చేస్తే విడిచిపెట్టిండ్రట. నిజంగనే వాళ్లు పాటలు పాడుతరు అని అన్నంకనే విడిచిపెట్టిండ్రట. నిజంగనే పాటలు పాడించుకుని మరీ విడిచిపెట్టిండ్రట. ఇట్లా ఆ రాత్రి నన్ను విడిచి పెట్టడానికి కూడా పాటనే కారణం' అని యాజ్జేసుకున్నడు భిక్షపతి. అయితే, అదే రాత్రి ఇంటికొచ్చినంక 'మాకు ఈ బాధలేంది' అని విచార పడ్డడట. ఆ వేదన నుంచి పాటను పరిపరి విధాలా తల్చుకున్నడట. తాను పుట్టింది, పెరిగింది, తనకు పాటలు ఎట్ల రాయబుద్దయింది, పాట రాసినందుకు ఉద్యోగం పోగొట్టుకున్నదీ, కడుపు నిండా తినని రోజులు. ఉద్యమంలో పడ్డ బాధలు. అన్నీ తలంపుకు తెచ్చుకోగా అట్లట్ల మొదలై, తాను బహువచనమై, కవి సమయం అయి, ఆ రాత్రి కురిసిన బాధలా, చినుకు చినుకు కురిసి వర్షం అయినట్టు చివరకు అమృతం కురిసిన రాత్రిలా దేవరకొండ భిక్షపతి ఒక మాతృస్థన్యం వంటి పాట రాసిండు. అదే, 'నిన్ను విడిచి ఉండలేనమ్మా...ఓ పాటమ్మ. ఎన్నడూ మరచిపో-నమ్మా..నా పాటమ్మ.'
+++
నిజానికి ధూందాంలో ఈ పాట పాడకముందు తాను జిల్లా స్థాయికే పరిమితం. తర్వాత తాను తెలంగాణం. ఇట్లా మలిదశ ఉద్యమంలో తాను ఎన్ని పాటలు రాసినప్పటికీ తెలంగాణ దృక్పథం, వారసత్వం, విప్లవం అన్నీ కలగలసిన ఒక పాట రాయడం, అది ధూందాం ద్వారా ప్రతి హృదయాన్ని చేరుకోవడం తనకు నిజంగానే ప్రాచుర్యాన్ని ఇచ్చింది. అమిత సంతోషాన్ని పంచింది. పాట తనకు ఇసొంటి జన్మనిచ్చినందుకు సాలురా అనుకుంటడట.
చిన్న అనుభవం. ఒక దగ్గరకు పోతుంటే, ఆటోలో తన పాటే. ఈ పాటే. వెన్క ఇద్దరు టీచర్లు. అందులో ఒకాయన ఏమున్నది. 'ఈ పాట ఎవరు రాసిండ్రో ' అని అంటే, ధన్‌మని డ్రైవర్ అంటడట...'ఆ బిక్షపతి మావోడే. నా సోపతిగాడే' అని! ఆ మాటకు ప్రయాణిస్తున్న భిక్షపతి, తన తండ్రీ ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నరట. చిత్రమేమిటంటే, ఆ డ్రైవర్‌కి తాను తెలియదు. కానీ ఓన్ చేసుకోవడం. ఇట్లా ఎవరైనా మా వోడే రాసిండని చెప్పుకునేంతటి స్థితి. ఇది తన అనుభవం అని కాదు. కవులందరూ పాట వల్ల పడ్డ ఆనందాతిశయం. దాన్ని కూడా ఈ పాటలో ముట్టుకున్నడు. ఎన్ని కష్టాలు పడ్డా ఇదొక సంబురం.
అయితే, తన పాటలో సరళత్వం, అందులో ఉన్న సార్వజనీన తెలంగాణ జీవితం, ఇష్టులను చేస్తుంది. మామూలు శ్రోతలనే కాదు, ఇతర కవిగాయకలనూ! అదీ ఈ కవి సాధించిన సాఫల్యత. 'నీతోడు ఉంటె ఏ బాధ ఉండదని తెలువనోళ్లు కొందరు. అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయేవాళ్లు ఎందరో' అని చెప్పి పాటే తన భాగ్యం అని సగర్వంగా చెపుకుంటడు.
+++
పాట చాలా సింపుల్‌గనే ఉంటది. కానీ, విన్నకొద్దీ అందులోని గాఢత తెలిసి వస్తది. 'ప్రతి మదిలోన మెదులుతూ ఉంటవో పాటమ్మ.'.. అని సార్వజనీనంగా అందరిలో ఉండే ఆర్తిని యాది చేస్తడు. అదే సమయంలో 'నా ఎదలోన పదిలంగున్నవో పాటమ్మ' అని ముక్తాయిస్తడు. ఇట్లా, అటూ- ఇటూ రెంటినీ జమాయిస్తడు భిక్షపతి. కవిని, శ్రోతనూ దృష్టిలో వుంచుకుని పాట గడతడు. వినేవాళ్లది కవి హృదయమైతే ఈ పాటను ఇంకా ఎంజాయ్ చేస్తరు. అదే సమయంలో తన వంటి వాడికి కూడా నువ్వు లేకపోతే నేనెవరో తెలియదమ్మా అనీ అంగీకరింపజేస్తడు. ఇక్కడ నేనెవరో అనడంలో తనకు ఉనికిని చూపిన పాటకు అమితాభిమానంతో కృతజ్ఞతలు అర్పిస్తడు. ఇట్లా, స్వయంగా ఒక కవి తన జీవిత ఇతివృత్తాన్ని లేదా తన పాణాన్ని చరణాలుగా చుట్టి ప్రపంచంలోకి విడిచిపెట్టి, భావోద్వేగాలకు గురిచేసి మళ్లీ వాటన్నిటినీ ఒక చుట్టచుట్టుకుని పేగులోలె మళ్లీ తన కడుపున దాపెట్టుకున్నట్టి పాట ఇది. రాసిన భిక్షపతి ధన్యుడు. విన్న వాళ్లం కృతజ్ఞులం.
++
తాను వ్యవసాయ కూలీ బిడ్డ. అమ్మ సత్తెమ్మ. నాయిన వెంకటయ్య. ఇంటర్ డిస్‌కంటిన్యూడ్. ఇద్దరు అక్క-చెల్లెండ్లూ ఇద్దరు అన్నదమ్ముల కుటుంబం. కానీ, పాటకు నిలబడ్డడు భిక్షపతి. తనకు పాటే జీవితం అయింది. చిన్నప్పుడు జయరాజన్న, నాగన్న, కానూరి బయ్యారంలో డప్పేసుకుని ఊరు మనదిరా.. అని పాడినప్పుడు పడ్డది. 'ఈ దొర ఏందిరో దోపిడేందిరో' అని ఎలుగెత్తి పాడినప్పుడు అనిపిం-చింది, మనం గూడ ఇట్ల పాడాలి. రాయాలీ అని. అట్ల రాయడం ప్రారంభం. తర్వాత కష్టాలు, నష్టాలు, అందులోనే పాటా ఆటా. సుఖం. అమ్మానాన్నల సంపాదనేమి లేదు. తాత తండ్రుల నాటి ఆస్తిపాస్తులు లేవు అన్నది ఎంత నిజమో...'నిన్ను నమ్ముకొనే బతుకుతున్నము.. ఓపాటమ్మ' అనడమూ అంతే నిజం. ఇది కవి సమయం. వందలాది పూర్తికాలం కవుల తెలంగానం సమయం.
ఇక్కడో విషయం. తన పిల్లలకు తాను పేరు పెట్టుకున్న తీరు గమనిస్తే తనలో ఎసొంటి కవి హృదయం ఉన్నదో తెలుస్తుంది. అవును. అబ్బాయి తుఫాన్ కుమార్. అమ్మాయి వరదా రాణి. నిజమే. విపత్తులు. వాటిని కూడా సహజంగా చూడటం తన కవి హృదయం. అయితే, ప్రకృతి విలయాలనూ తాను అర్థం చేసుకుంటడు. కానీ, మనిషి తీరుతెన్నులే తనని కలచి వేస్తయి. అనివార్యంగా కవిని చేస్తయి. కవి సమయం అంటే అదే. ఇదే తన పరిమితి, విస్తృతి. ఎట్లా అంటే, దోపిడీ, పీడన, పోరాటం. సమాజాన్ని పునర్నిర్మించడం, అందుకు పాటే విప్లవాన్ని నూరిపోయడం, సంఘటితం చేయడం, మార్పుకు పూనుకోవడం. తెలంగాణలో పాట ఇట్లా ప్రముఖ పాత్ర వహించడాన్ని తాను కైగట్టిండు. 'నిన్ను విడిచి ఉండలేనమ్మ' అన్న పాట ఒక రకంగా దశాబ్దాలుగా తెలంగాణలో ఏం జరిగింది, జరుగుతున్నదో చెప్పకనే చెప్పే పాట.
+++
ఈ పాట మొత్తం ఇరవై చరణాల దాకా ఉందిగానీ ప్రాచుర్యంలోకి వచ్చింది మాత్రం పదమూడు చరణాలు. మొదట ట్రాక్ మీద గర్జన పాడినప్పటికీ ఇంత పాణంతోని రాసుకున్నవు. నువ్వే పాడరాదురా అని గద్దరన్న చెప్పడంతో నేనే పాడిన అని వివరించిండు భిక్షపతి.
ఉద్యమానికి ఊపిరిలూదుకుంట గద్దరన్న వెంట ఉరుకుతుంటవు. ఊరె సెలిమలాగ గోరటి వెంకన్న చేతి-వెంట రాలుతుంటవు. ఊరూరా దొరలకు ఎదురు తిరగమన్నందుకే ఓ పాటమ్మ...జయరాజన్న వెంట జైలుకు వోయి జంగ్ సైరనూదినావమ్మ అని తొలి చరణం. ఇందులో మలిదశ ఉద్యమానికి ఊపిరిలూదిన పాటమ్మను గద్దరన్న వెంట ఉరుకుతున్నదని చెప్పడంలో కవి ప్రథమ పాధాన్యం తెలంగాణ ఉద్యమ ఒరవడిదే అని చెప్పకనే చెబుతడు. ఖమ్మం జిల్లా బయ్యారం మా ఊరు. ఉద్యమాలు లేకుంట పాటెక్కడిది అని కూడా అంటడు. పీడీఎస్‌యు. న్యూడెమెక్రసి, అరుణోదయ. నాగన్న, జయరాజన్న తదితరుల స్ఫూర్తితో వారి వెంట తిరిగి ఉద్యమంలో వికసించిన తన రోజులనూ యాది చేసుకుంటడు.
పాటలో చాలా ఉంటై. పల్లవి తర్వాత వచ్చే రెండో చరణం కవులను ప్రస్తావిస్తే చివరి చరణం కన్నా ముందు చరణంలో శంకరన్న, సారంగపాణిలను గుర్తు చేసుకుంటూ గాయకులకు యాది చేస్తడు. అలాగే ఈ చరణంలోనే సుద్దాల హన్మంతు, సుబ్బారావు పాణిగ్రాహిల ఒరవడిని, అట్లే చిందు ఎల్లమ్మను యాది చేసు-కుంటడు. పాటను పేరుపేరునా సుసంపన్నం చేయడంతో పాట వింటుంటెనే వాళ్లు కండ్ల ముందు కదలాడి వాళ్ల గానం, కళలతో పాట హృదయాలను మరింత హత్తుకుంటుంది.
కాగా, పాటను తాను నిర్మించిన పద్ధతి చూస్తే, అందులో ఒక విశదరీతి ఉన్నది. నిజానికి ప్రసంగరూపం ఉన్నప్పటికీ గొప్ప గాయక లక్షణమూ ఉన్నది. బోధపర్చడం ఉన్నది. వందనాలు అర్పించేలా చేయడమూ ఉన్నది. అయితే తన ఒరవడి ఇదే. విశదీకరించడం. అన్ని పాటల్లోనూ అదొక అంతఃస్సూత్రంగా ఉంటది. అయితే తన పాపులర్ పాటల్ని గమనిస్తే, ఒక ఐదు చూడొచ్చు. ఒకటి, అత్యంత ప్రాచుర్యంలోకి వచ్చింది, 'నిన్ను విడిచి ఉండలేనమ్మ' అన్న పాటే. ఇది ఈ కవిని కవిగా తప్పా ఇంకో బతుకు లేని స్థితిని పాడుకునే పాట, అట్లే సగౌరవంగా చరిత్రలో తెలంగాణ పాట చేసిన మహత్తరమైన కార్యాన్ని బోధపర్చే పాట. రెండోది, 'అమ్మా నన్ను అమ్మకే.'.. అన్న పాట. పిల్లల్ని అమ్మవద్దని, బిడ్డే తల్లికి నివేదించుకునే ఆర్థ్రగీతం. మూడోది 'ఓ వెలిగే వెన్నెలమ్మా...చల్లని జాబిలమ్మా' ఇది ఒక తల్లి తన బిడ్డ శవం పక్కన కూచొని రోదిస్తున్నప్పుడు, ఆ దుఃఖశోకాన్ని తానే బిడ్డయి స్వీకరించి, తల్లి ఎడబాటును అపూర్వంగా ఆలపించిన కవిత్వం. దీన్ని తన మేనకోడలు పాడితే వినాలి. ఏడ్వనోడు మనిషికాదు. ఆసొంటి పాట అది. నాలుగోది, 'నా పల్లెతల్లి మర్చిపోయి వుండలేక...నేనెక్కడున్నా నా పల్లె సల్లగుండాలి రన్న' అన్న పాట. ఇది పల్లె మమకారం ప్రధానంగా సాగుతుంది. ఆ తర్వాత సిటీకేబుల్లలో, జిల్లాలలో మస్తు ఫేమస్ అయిన పాట...'ఉద్యోగం జేస్తనంటివిరా బుచ్చయ్యా...ముద్దుగ నన్ను జూస్తనంటివిరో బుచ్చయ్య' అన్న పాట. ఇది నిజానికి తన భార్యమీద రాసిండు. పని చేస్తనని, పాటలు వాడుకుంట తిరుగుతున్న తన స్థితిమీదే, తన భార్య దిక్కు నుంచి రాసిన పాట. అట్లా తాను ఎన్నో పాటలు రాసిండు.
వాటన్నిటిలో కవితాన్యాయం ఏమిటీ అని గనుక గమనిస్తే ఒక అస్తిత్వం ఉంటుంది. అది దెబ్బతిని ఉంటది. దాన్ని విశదీకరించడానికి స్వీయాత్మక ధోరణిని అవలంభించడం వుంటుంది. అదే మలిదశ ఉద్యమం ఇచ్చిన బలిమి.
+++
నిజం మరి. ఈ కవి స్వయంగా కష్టజీవి. దళితుడు. ఎస్సీ. తానే కాదు, తెలంగాణంలోని ప్రముఖ కవిగాయకులంతా వెలివాడల్లో పురుడు పోసుకున్నవారే. పల్లె తల్లి కడుపు పంట అయినోళ్లే. అందుకే వెలివాడను కవి చివరి చరణంలో ఆర్ధ్రంగా తడుముకుంటూ, తెలంగాణ తల్లి చెంతకు వస్తడు. పాటమ్మను తోబుట్టువుగా పరిచయం చేస్తడు. ఆడిబిడ్డగా అప్పజెప్పుతడు. మొత్తంగా గొప్ప ఔదార్యంతో, శిరసు వంచి పాదాలను ప్రణమిల్లిన రీతిలో ఇట్లా ప్రతి చరణం పాటకు మొక్కుతది. ముగింపుగా ఏ తల్లి ఈ జన్మనిచ్చిందోగానీ ఓ పాటమ్మా...పదికాలాల పాటు సల్లగుండాలే అంటూ, నా తల్లి నీకు వందనాలమ్మా అని కవి తన మాతృమూర్తినే తల్చుకుంటున్నడా అన్నట్టు పాటను ముగిస్తడు. అట్లా పాటతల్లి రుణం తీర్చుకు-న్నడు భిక్షపతి. అటువంటి మన కాలపు కవికి వందనం. తన గానానికి అభినందనం.
- కందుకూరి రమేష్ బాబు
29.06.2014
song- ఓ పాటమ్మ
+++++++
నిన్ను విడిచి వుండలేనమ్మా
నిన్ను విడిచి వుండలేనమ్మా... ఓ పాటమ్మ
ఎన్నడూ మరిచిపోనమ్మో... నా పాటమ్మ
ప్రతి మదిలోన మెదులుతు వుంటవో పాటమ్మ
నా ఎదలోన పదిలంగున్నవో పాటమ్మ
॥ నిన్ను ॥
ఉద్యమానికి ఊపిరూదుకుంట గద్దరన్న వెంట ఉరుకుతుంటవు
ఊరె సెలిమలాగ గోరేటి వెంకన్న చేతివెంట రాలుతుంటవు
ఊరూరా దొరలకు ఎదురు దిరగమన్నందుకే ఓ పాటమ్మ
జయరాజన్న వెంట జైలుకువోయీ జంగ్ సైరనూదినావమ్మ
॥ నిన్ను ॥
వంగపండూ ప్రసాదు నోటి వెంట వడివడిగా దూకుతుంటవు
గూడ అంజన్నకు తోడు నీడగుంటు ఊరువాడ మనదంటావు
అందెశ్రీ వొంటినిండ అలుముకొని ఓ పాటమ్మ
వరంగల్లు శీనన్న వెంట బెట్టుకొని పల్లెచుట్టు వస్తవో ఓ పాటమ్మ
॥ నిన్ను ॥
ప్రేమ ప్రేమకు మధ్య పెద్దమనిషివై ఇద్దరినీ కలుపుతావమ్మ
యుద్ధంలో ఒరిగిన వీరుల్ని ముద్దాడే దాక నిద్దురా పోవమ్మ
అమరవీరుల అమ్మ నాన్నలకు నువ్వు ఓ పాటమ్మ
కన్నబిడ్డల కండ్ల ముందు చూపిస్తావు వెన్నెలైనా మళ్ళి బతికిస్తు ఉంటావు
॥ నిన్ను ॥
పరదేశీ వాళ్ళ నోటిలోన నువ్వు పడరాని పాట్లు పడుతుంటవు
స్వదేశి స్వార్థాన్ని అర్థం చేసుకొని మెదులుతుంటవు
ఒకడు రాసి ఇంకొకడు పేరు మోస్తే ఓ పాటమ్మ
కనులారా జూసి ఏమి జేయలేక కుమిలి కుమిలి పోతవోయమ్మ
॥ నిన్ను ॥
దండకారణ్యంలో దండు నడిపేటోళ్ళతోని అండగా ఉంటవు
దళంలోకి కొత్త తమ్ముళ్ళను చేరదీయడంలో ముందుంటవు
ఒరిగిన అమరవీరుల ఆశయాలు ఒక్కొక్కటీ గుర్తు చేస్తావో
దండిగా పోరు జేయమని గుండె ధైర్యాన్ని నూరిపోస్తవో
॥ నిన్ను ॥
నీ తోడు ఉంటే ఏ బాధ ఉండదని తెలువనోళ్ళూ కొందరు అసలు
కళాకారులై పుట్టనందుకు కుమిలి పోయేవాళ్ళు ఎందరో
ఎంత కాటకుడైనా బాతురూముల నిన్ను
బతిమిలాడు కుంటాడోయమ్మ
నువ్వు లేకపోతే ఈ లోకానికి నేనెవ్వరో తెలియదోయమ్మా
॥ నిన్ను ॥
తొలకరొచ్చి రైతు అరక దున్నే కాడ చేరదీర చెలిమి చేస్తావో
పంట రాసి పోసి కుండ కొలిచే కాడ రైతు నోట రాగమైతవు
పంటనంత బండిమీద కెత్తినంక ఎడ్లమెడలో గంటవైతవో
గిట్టుబాటు ధరకు కొట్లాడమని కోటి గొంతులల్ల ఒక్కటైతవో
॥ నిన్ను ॥
సత్యం గల్ల మా సమ్మక్క సారక్క తల్లులని అంటవు మహిమగల్ల
మా దేవుడూ ఎములాడ రాజన్నంటావు
అల్లా, ఏసు, కొమిరెల్లి మల్లన్న కోటి దేవతలెందరో
నీ కూత చెవున పడకపోతే బయటకు రానని మొండికేస్తరో
॥ నిన్ను ॥
దొంగ సర్కారుకు వంగి బతకద్దని సంఘాలెన్నోవెట్టి వస్తవు
అన్యాయాన్ని ఎదిరించే అన్నలకు అండదండగా ఉంటవు
పోరు జెయ్యకుంటే బతుకు మారదన్నందుకే ఓ పాటమ్మ
కడుపులోన ఎన్ని తూటాలు వడ్డా కలత చెందని మనసు నీదమ్మ
॥ నిన్ను ॥
అమ్మనాన్నల సంపాదనేమి లేదు తాత తండ్రుల నాటి
ఆస్తుపాస్తులు లేవు.
కడుపు మాడ్చుకొని కన్నవాళ్ళనిడిసి ఎన్నో ఊర్లు తిరిగి గెలిచి వస్తము
నిన్ను నమ్ముకొనే బతుకుతున్నము ఓ పాటమ్మ
ఉన్ననాడు కల్సి తింటము లేకుంటే నిన్ను తలుసుకుంటము
॥ నిన్ను ॥
సుద్దాల హన్మంతును ముద్దాడి బుద్ధి మాటలెన్నో జెప్పినవు
సుబ్బారావు పాణిగ్రాహి చేతిలోన జమిడిక మోతై మోగినవు
చిందు ఎల్లమ్మతో ముందు నడిచి మా పల్లెల్ని కలియ తిరిగినవు
శంకరన్న సారంగపాణిలతో కడదాక కలిసి నడిచినవు
॥ నిన్ను ॥
వెలివాడల పురుడు పోసుకొని పల్లె తల్లి కడుపు పంటవైతవు
తెలంగాణకు తోబుట్టువైతవు అందరికీ ఆడబిడ్డవైతవు
ఏ తల్లి ఈ జన్మనిచ్చిందోగానీ ఓ పాటమ్మా
పదికాలాల పాటు సల్ల గుండాలే నా తల్లి నీకు వందనాలమ్మ
॥ నిన్ను ॥
దేవరకొండ భిక్షపతి
98495 66908

No comments