కీలక పాత్ర పోషిస్తున్న ఓయూ తెలంగాణ విద్యార్థి జేఏసీ
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓయూ తెలంగాణ విద్యార్థి జేఏసీ
రానున్న రోజుల్లో రాజకీయ పార్టీగా అవతరించనుందా? కేసీఆర్ చెప్పు చేతుల్లో
నడుచుకుంటున్న తెలంగాణ రాజకీయ జేఏసీ,అలాగే టీఆర్‌ఎస్, బీజేపీలకు
ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగనుందా? కేసీఆర్ టిక్కెట్ల కోసం టీ జాక్ ఛైర్మన్
కోదండరామిరెడ్డితో పాటు జాక్ నేతలు కేసిఆర్ బస చేసే ఫాం హౌస్ వద్ద
క్యూకడుతుండడంపై విద్యార్ధులు గురి పెడు తున్నారా? అంటే అవు ననే సమాధానం
వినిపిస్తోంది. శనివారం సమావేశమైన ఓయూ విద్యార్ధి జేఏసీ తన రాజకీయ
భవితవ్యాన్ని, పార్టీపై దిశా నిర్దేశాలను సూత్రప్రాయంగా విశదీ రించింది.
ఈమేరకు తెలం గాణ స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఆ
సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరాటే రాజు శనివారం మీడియాకు వివరించారు.
తెలంగాణ స్టూడెంట్ జేఏసీ, ఓయూ జేఏసీ రాజకీయ పార్టీగా అవతరించనుందని కరాటే రాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను తాము ఈసందర్బంగాప్రకటిస్తున్నామన్నా రు. స్థానిక సంస్థల ఎన్నిక ల్లోనై తాము పోటీ చేస్తామన్నారు. సెప్టెంబర్ 16 నాడు 5 లక్షల మంది విద్యార్థులతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని కరాటే రాజు పేర్కొన్నారు. తెలంగాణ స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఆయన ప్రకటించారు.తాను మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్, లేదా నల్లగొండ జిల్లా దేవర కొండలో పోటీ చేస్తానన్నారు. మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుండి మున్నూరు రవిని, అదే జిల్లా నారాయణ పేట నుండి సుదీప్‌రెడ్డిని, కల్వకుర్తి నుండి ఆం జనేయులు తమ అభ్యర్థులుగా రంగంలో ఉంటారన్నారు.
అలాగే వరంగల్‌జిల్లా డోర్నకల్‌లో డా. నెహు నాయక్, ఖమ్మం శాసనసభ స్థానం నుండి రాందాస్, కరీంనగర్ నుండి మోతీలాల్, రంగారెడ్డి నుండి గేత్యానాయక్, నిజామాబాద్ అసెంబ్లీ టిక్కెట్టును జైపాల్‌కు, మెదక్ టిక్కెట్టు అల్లుడు జగన్ ముదిరాజ్, వరంగల్ జిల్లా డోర్నకల్‌లో డా. నెహునాయక్‌కు కేటాయించడం జరుగుతుంద న్నారు. సెప్టెంబర్ 17న పార్టీని ఆవిర్భవించనున్నామని, ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో ఉన్న టీఆర్‌ఎస్, బీజేపీతో ఎలాంటి పొత్తులు ఉండవని విద్యార్థి జేఏసీ నేతలు ప్రకటించారు. జూలై 10 నుండి జిల్లాల్లో సదస్సులు నిర్వహించనున్నామని, జూలై 20 నుండి సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం కానుందని విద్యార్థి జేఏసీ నేతలు తెలియజేశారు. త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లోనూ విద్యార్థి జేఏసీ పోటీకి సిద్దమైంది.

No comments