1

Breaking News

మృతులసంఖ్య 10వేలు

ఉత్తరాఖండ్‌లో వర్షాలు, వరదలలో ఎంతమంది చనిపోయారో ఎప్పటికీ లెక్క తెలియదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ బహుగుణ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మృతుల సంఖ్య వందలు, వేలల్లో ఉంటుందని భావిస్తున్నా మన్నారు. మృతుల సంఖ్య ఎంత అనేది స్పష్టంగా చెప్ప లేమని బహుగుణ పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. చనిపోయిన వారి సంఖ్య వందల్లో నుంచి వేలల్లోకి ఎగబాకవచ్చని అభిప్రాయ పడ్డారు. వరదల్లో ఎంతో మంది కొట్టుకుపోవడం లేదా బురదలో కూరుపోయి మృతి చెందడంతో మృతుల సంఖ్యపై స్పష్టత రావడం లేదన్నారు. ఎంతో మంది నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారని, మరెందరో భూస్థాపి తమైయ్యారని తెలిపారు.

కాగా, మృతులసంఖ్య 10వేలు ఉంటుందని శనివారం ఆ రాష్ట్ర శాసనసభ అధిపతి గోవింద్‌సింగ్‌ కుంజ్‌వాల్‌ తెలిపిన విషయం విదితమే. ఆ విలయాన్ని ప్రత్యక్షంగా చూసినవారు చెబుతున్నదాన్ని బట్టి వారి సంఖ్య 10 వేలకు పైనే ఉండొచ్చని అనిపిస్తోందని అన్నారు. మట్టిదిబ్బలు, బురదలో పెద్ద సంఖ్యలో మృతదేహాలు కూరుకుపోయి ఉన్నాయని చెప్పారు. కేదార్‌నాథ్‌ తదితర ప్రాంతాలలో 600 మంది మృత దేహాలు మాత్రమే లభ్యమయ్యాయని, వర్షాలు, వరదల నుంచి ఉత్తరాఖండ్‌ ఇప్పుడిప్పుడే కోలుకుం టుందని బహుగుణ చెప్పారు. ఈ విపత్తుపై రాష్ట్ర ప్రభు త్వం సరిగా స్పందించలేదని, మానవ తప్పిదం వలనే ఈ విపత్తు సంభవించిందన్న ఆరోపణలను ముఖ్యమంత్రి బహుగుణ ఒక ఇంటర్వ్యూలో ఖండించారు. తప్పిపోయిన తమ రాష్ట్ర ప్రజల ఆచూకీ కోసం ఆయా జిల్లాల అధికారులు రంగంలోకి దిగారని, బాధితులకు నష్టపరిహారం చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు.

అలాగే, ఇతర రాష్ట్రాల ప్రజల ఆచూకీ కోసం తమకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. అయితే, ఉత్తరాఖండ్‌కు ఏయే రాష్ట్రాల నుంచి ఎంతమంది యాత్రికులు వచ్చారు, ఎంతమంది తిరిగి వెనకకు రాలేదో ఆయా రాష్ట్రాలు వివరాలు పంపితే వారి వర్షన్‌ను ఆమోదించి బాధితులకు నష్టపరిహారం వివరాలను ఆ రాష్ట్రాల చీఫ్‌ సెక్రటరీలకు పంపిస్తామని బహుగుణ తెలిపారు.కేదార్‌నాథ్‌లో ఒక డిఐజీ(మిస్టర్‌ గుంజియాల్‌) స్థాయి అధికారి పర్యవేక్షణలో మృతదేహా లకు దహన సంస్కారాలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే, వీధులలో పడివున్న మృతదేహాలకు కూడా అంత్యక్రి యలు నిర్వహిస్తున్నారని, వివిధ భవనాల శిథిలాల కింద చిక్కుకుపోయినవారిని బయటకు తీసేందుకు కొన్ని ఆధునిక యంత్రాలు అవసరమని, ప్రస్తుతం ఆ యంత్రాలు ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి లేనందున కొన్ని జేసీబీలను ఉపయోగించి భవనాల శిథిలాలను తొలగిస్తున్నట్లు ఆయన వివరించారు.

No comments