కేసీఆర్ కలలు
తెలంగాణలో తానే తిరుగులేని రారాజుగా ఉండాలని, తన మాటే చెల్లుబాటు కావాలన్న
లక్ష్యంతో చక్రం తిప్పుతున్న గులాబీ దళపతి కేసీఆర్ కలలు ఎన్నికలకు ముందే
కల్లలవుతు న్నాయి. ఏ జాక్‌లనయితే నమ్ముకున్నారో అవే జాక్‌లు ఇప్పుడు తన
పార్టీ పుట్టిముంచేందుకు సిద్ధమవుతుండటం కేసీఆర్‌ను కలవరపరుస్తోంది. తనను
ఆకాశానికెత్తిన ఓయు జాక్ తన నీడ నుంచి బయటపడి, సొంత రాజకీయ పార్టీ
స్థాపనకు పరుగులు పెడుతుండటం గులాబీకి ముళ్లు గుచ్చుకున్న ట్లయింది. అటు
జాక్ చైర్మన్ కోదండ రామిరెడ్డి కూడా సొంత పార్టీకి ఉవ్విళ్లూరుతున్నారు.
ఇంకో వైపు తెలంగాణపై పట్టుసాధించేందుకు కిషన్‌రెడ్డి సారథ్యంలోని కమల దళం
ఉరుకులు పెడుతోంది. కమలదళం హడావిడికి గులాబీ దండు హడలెత్తిపోతోంది. మరోవైపు
తాజాగా తెలంగాణ తామే తెస్తామంటూ జానారెడ్డి దళం నిజాం కాలేజీ బహిరంగసభతో
జనక్షేత్రంలో వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. తాజా పరిణామాలు
‘తెలంగాణ జాతిపిత’గా పిలిపించు కునేందుకు తపనపడు తున్న కేసీఆర్‌కు
శరాఘాతమే.
No comments