కిరణ్ మనసులో మాట
పునర్వ్యవస్థీకరణ అంటూ జరిగితే తమకు అవకాశం ఇప్పించాలని కొందరు ఆశావహులు
ఢిల్లీ దాకా వెళ్ళి ప్రయత్నాలు చేసుకున్నప్పటికీ కిరణ్ మనసులో మాట
ఏమిటన్నది ఎవరికీ అవగతం కాటంలేదు. అయితే వచ్చేది ఎన్నికల సంవత్సరం కాబట్టి
తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా సమర్థించి, తనతో కలసి వచ్చేవారికే అవకాశం
కల్పిస్తారని సీనియర్ నేతలు సహజంగానే చెబుతున్నారు. నిజానికి ధర్మాన, సబిత
రాజీనామాల పర్వం పూర్తి అయిన తర్వాత మరో నలుగురు మంత్రులు కన్నా లక్ష్మీ
నారాయణ, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డిపై కూడా వేటు పడుతుందని, వారి
రాజీనామాలను సైతం ముఖ్యమంత్రి కోరనున్నారని అప్పట్లో ప్రముఖంగా వార్తలు
వచ్చాయి. ఈలోగా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్ళిరావటం, మ రో మంత్రి
డీఎల్ రవీంద్రరెడ్డి విదేశీ పర్యటనలో ఉండ గానే బర్తరఫ్ చేయటం వంటి
పరిణామాలతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఖాయం అని, అసెంబ్లీ సమావేశాలలోపే
అది జరుగుతుందని కూడా వార్తలు, కథనాలు వచ్చాయి. ఈ ముగ్గురితోపాటు మరో
ఇద్దరు మంత్రులు పార్థసారథి, శైలజానాథ్, వట్టి వసంతకుమార్‌ను కూడా
తప్పిస్తారని అందరూ అంచనా వేశారు. అయితే వీరి విషయంలో ఇప్ప టిదాకా ఏ
నిర్ణయమూ రాకపోవటంతో వారి భవితవ్యం ఏ మిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
No comments