మరి కొందరిపైనా వేటు
మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీ కరించాలా?....సర్దుబాటుతో
సరిపెట్టాలా?...ఎవరిని ఎం పిక చేసుకోవాలి?... ఇంకా ఎంతమందిని తీసేయాలి?...
అసలు తీసేయాలా? వద్దా?.... లాంటి అన్ని విషయాలలో కాంగ్రెస్ అధినాయకత్వం
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఇష్టానికే వదిలేసినట్టు కనిపిస్తున్నది.
శాసనసభ బడ్జెట్ రెండవ విడత సమావేశాలతర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీ కరణ
జరుగుతుందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఏఐసీసీ కార్యదర్శి
కె.బి.కృష్ణమూర్తి నోట ఇలాంటి సంకే తాలే వినిపించటంతో ఇది అధినాయకత్వం మాటే
అయి ఉంటుందని కాంగ్రెస్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. కళంకిత మంత్రులుగా
ఆరోపణలు ఉన్న ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రారెడ్డితో అధినాయకత్వం ఆదేశాల
మేరకే రాజీనామాలు చేయించిన కిరణ్, మరి కొందరిపైనా వేటు వేస్తారా లేదా
అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న గా తయారైంది.వేటు ఖాయం అన్న జాబితాలో
ఉన్నట్టు చెబుతున్న మంత్రి వట్టి వసంతకుమార్ శుక్రవారం ముఖ్యమంత్రిని
కలుసుకోవటంతో ఆయనపై చర్య ఉం టుందా లేదా అనేది ఇప్పుడు తాజా
చర్చనీయాంశమైంది.
No comments