చావులను తన రాజకీయ లబ్ధి కోసం
అమరుల కుటుంబాలను టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మోసగిస్తూ, తన రాజకీయ
పబ్బాన్ని గడుపుకుంటున్నారని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి
దయాకర్‌రావు మండిపడ్డారు. తెలంగాణ కోసం ఆత్మత్యాగం చేసుకున్న శ్రీకాంతచారి
కుటుంబాన్ని ఆదుకుంటానన్న కేసీఆర్ కేవలం తన రాజకీయ అవసరాల కోసం ఆ
కుటుంబాన్ని వాడుకున్నారని ధ్వజమెత్తారు. ఎల్బీనగర్ చౌరస్తాలో
శ్రీకాంతచారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని, చౌరస్తాకు శ్రీకాంతచారి పేరు
పెట్టేందుకు కృషి చేస్తానన్న మాటలన్నీ ఎమైయ్యాయంటూ కేసీఆర్‌ను ఆయన సూటిగా
ప్రశ్నించారు. ఆదివారం ఎన్టీఆర్ ట్రస్టుభవన్‌లో ఎర్రబెల్లి దయాకర్‌రావు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో టీఆర్‌ఎస్
బలోపేతానికి, తెలంగాణ ఉద్యమవ్యాప్తికి కృషి చేసిన నాగరాజు అనే నాయకుడు
ఆత్మహత్య చేసుకుంటే కూడా ఆ కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించలేదని గుర్తు
చేశారు.
తెలంగాణ సాధన కోసం ఉసురు తీసుకున్న అమరుల కుటుంబాలను కేసీఆర్ నిలువునా మోసగిస్తున్నారని విరుచుపడ్డారు. ఇప్పటికైనా తెలంగాణ వాదులు, ఈ ప్రాంత ప్రజలు కేసీఆర్ నిజస్వరూపాన్ని గమనించాలని కోరారు. ఓట్లు, సీట్ల కోసమే కేసీఆర్ తెలంగాణ వాదాన్ని జపిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సాధన పట్ల ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాంరెడ్డి, టీఆర్‌ఎస్ చైర్మన్‌గా మాదిరిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తొత్తుగా మారి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కోదండరాంరెడ్డి వైఖరి వల్ల టీజేఏసీ నుండి మేధావులు, కవులు, కళాకారులు బయటకు వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు.
సకల జనుల సమ్మెను కేసీఆర్ నీరుగారిస్తే, కోదండరాంరెడ్డి ఆయనకు సహకరించారన్నారు. తెలంగాణ సాధన కోసం ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి కేసీఆర్‌కు లేదన్నారు. వారి చావులను తన రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకుంటున్నారని శివాలెత్తారు. టీడీపీ నేతలు ఆంధ్రోళ్ల బూట్లు నాకుతున్నారని విమర్శిస్తున్న కేసీఆర్, 20 ఏళ్లపాటు ఎవరి బూట్లు నాకారని ప్రశ్నించారు.

No comments