1

Breaking News

ఫిక్సింగ్‌ జాడలు రాష్ర్టంలో...

ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ జాడలు రాష్ర్టంలో నూ వెలుగుచూస్తున్నాయి. ఐపీఎల్‌ టోర్నీ ఆరవ అంచె పోటీల్లో పలు మ్యాచ్‌లు ఫిక్సింగ్‌కు గురైనట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించి నిందితు లను అదుపులోకి తీసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని అరెస్టుచేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌ ఆరవ సీజన్‌లో పలు మ్యాచ్‌ల ఫిక్సింగ్‌కు గురైనట్లు, బుకీల ప్రమేయంతో స్పా ట్‌ ఫిక్సింగ్‌ జరిగినట్లు నిర్ధారించుకున్న ఢిల్లీ పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. మారుపేర్లతో టీఆర్‌ ఎస్‌ పార్టీకి చెందిన ఒక ముఖ్య నాయకుడు బుకీగా వ్యవహరించినట్లు ఢిల్లీ, కోల్‌కత్తా పోలీసులు అనుమానిస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇంచార్జిగా వ్యవహరిస్తున్న మహ్మద్‌ షకీల్‌కు స్పాట్‌ ఫిక్సింగ్‌, బెట్టింగ్‌ ముఠాలతో సంబంధాలున్నట్లు వారు నిర్ధారణకు వచ్చారు.

అందుకే గతపక్షంరోజులుగా అతనికోసం ముమ్మరవేట కొనసా గిస్తున్నారు.స్పాట్‌ఫిక్సింగ్‌ కుంభకోణంలో దావూద్‌ ఇబ్రహీం పాత్ర తెర పైకి రాగానే అతనితో సన్నిహిత సంబంధాలున్న షకీల్‌ విదేశాలకు పారిపో యినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలోనూ షకీల్‌ పాసుపోర్టు కుంభ కోణంలో నిందితునిగా ఉన్నారు. నకిలీ పాస్‌పోర్టులపై ఆంధ్ర, గు జరాత్‌ రాష్ట్రాల్లో వ్యక్తులను సరిహద్దులు దాటించారనే అభియోగాలు అతనిపై ఉన్నాయి. తొలుత టీడీపీలో చేరిన షకీల్‌, 2009లో సాధారణ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ తీర్థంపుచ్చుకున్నారు. బోధన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన ఆయన ప్రస్తుతం ఇంచార్జిగా కొనసాగుతున్నారు.

No comments