1

Breaking News

కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుతో....

చలో అసెంబ్లీ కార్యక్రమం సందర్భంగా పోలీసులు, ప్రభుత్వం వ్యవహ రించిన తీరుకు, అక్రమ అరెస్టులకు నిరసనగా శనివారం తెలంగాణ వ్యాప్తంగా బంద్‌ పాటించాలని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుతో రాజకీయ జేఏసీ భాగస్వామ్య పక్షాలు బీజేపీ, సీపీఐ ఎంఎల్‌ (న్యూడె మాక్రసీ) విభేదించాయి. ఆ పిలుపుతో తమకు సంబంధం లేదంటూ స్పష్టం చేశాయి. జాక్‌లో భాగస్వాములమె ైనప్పటికీ తమతో కనీసం మాటమాత్రం సంప్రదిం చకుండా, కేసీఆర్‌ ఏకపక్షంగా ఈ ప్రకటన చేశారని దుయ్యబట్టాయి. కేసీఆర్‌ బంద్‌ పిలుపునకు ఉస్మానియా విద్యార్థి జేఏసీ మాత్రమే మద్దతు ప్రకటించింది.

జాక్‌ నిర్ణయం తేలకుండానే
చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరామిరెడ్డి, ఇతర ఉద్యోగ సంఘాల నేతలు అశోక్‌నగర్‌ వద్దఅరెస్టు అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ తదుపరి కార్యాచరణను సాయంత్రంఅందరితోమాట్లాడి ప్రకటిస్తామని చెప్పారు. వారు ఒకవైపు అలా చెప్పారో లేదో కేసీఆర్‌ ఈ బంద్‌ కు పిలుపుఇవ్వటం అందరినీ ఆశ్చర్యపరచింది. జాక్‌ నేతలు సైతం కేసీఆర్‌ఇచ్చిన పిలుపు పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు సమాచారం.

బీజేపీ...అగ్గిమీద గుగ్గిలం
ఒకవైపు చలో అసెంబ్లీ కార్యక్రమం పూర్తి కాకుండానే, నిరసనలు, ముట్టడుల కార్యక్ర మం కొనసాగుతుండగానే, అరెస్టు అయిన వారు విడుదల కాకుండానే తెలంగాణ బంద్‌కు కేసీఆర్‌ పిలుపు ఇవ్వటంపట్ల బీజేపీ తీవ్ర ఆగ్ర హంతో ఉంది. జాక్‌లో టీఆర్‌ఎస్‌ అనుసరిస్తు న్న ధోరణిని మొదటినుంచీ తాము ఆక్షేపిస్తూనే ఉన్నామని, అయినా ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ పోకడలలో ఎలాంటి మార్పు రాలేదన్నది తాజా పిలుపుతో ధ్రువపడిందని బీజేపీ సీనియర్‌ నేత లు వ్యాఖ్యానించారు. తామంతా హైదరాబాద్‌ లోనే పోలీస్‌ స్టేషన్‌లోనే ఉన్నామని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, న్యూడెమాక్రసీ నేత సూర్యం తదితరులమంతా ఒకేచోట ఉండగా తమతో కనీసం మాటమాత్రమైనా చెప్పకుండా, ఎలాంటిసంప్రదింపులూ లేకుండా కేసీఆర్‌ బంద్‌కు పిలుపు ఇవ్వటం ఆయన ఏకపక్ష వైఖరికి నిదర్శనం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ పిలుపుతో త మకు సంబంధంలేదని, తాము పాల్గొనబోవ టం లేదని స్పష్టం చేశారు.

సీపీఐ అదే మాట
మరోవైపు జాక్‌ భాగస్వామ్యపక్షమైన సీపీఐ సైతం ఇదే నిర్ణయాన్ని ప్రకటించింది. కేసీఆర్‌ ఎవరినీ సంప్రదించకుండానే బంద్‌కు పిలుపు ఇవ్వటం దారుణం అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. బంద్‌లో తమ పార్టీ పాల్గొనబోదని స్పష్టంచేశారు. చలో అసెం బ్లీ సందర్భంగా మఖ్దూంభవన్‌పై పోలీసులు దాడి చేయటాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా శనివారంనిరసన ప్రదర్శనలు నిర్వహించాలని నారాయణ పిలుపు ఇచ్చారు. జాక్‌లో మూడవ భాగస్వామ్య పక్షం న్యూ డెమాక్రసీ నాయకత్వం కూడా ఇదే వైఖరితో ఉన్నట్టు తెలిసింది.

ఫామ్‌ హౌస్‌లో కూర్చుని పిలుపు ఇస్తారా?: టీడీపీ
మరోవైపు జాక్‌తో సంబంధం లేనప్పటికీ, చలో అసెంబ్లీ కార్యక్రమంలో విడిగా పాల్గొన్న తెలంగాణ టీడీపీ ఫోరం సైతం కేసీఆర్‌ నిర్ణయాన్ని తప్పు పట్టింది. కేసీఆర్‌ తన ఫామ్‌ హౌస్‌లో కూర్చుని బంద్‌కు పిలుపు ఇస్తే ఎలా అని ఫోరం నేత ఎర్రబెల్లి దయాకరరావు ప్రశ్నించారు.

No comments