నష్టాన్ని రూ 600 కోట్లుగా అంచనా
వాతావరణం సహకరించకపోవడంతో, వరదలకు గురైన హిమాచల్‌ప్రదేశ్ జిల్లా
కిన్నౌర్‌లో ఆదివారం సహాయ కార్యక్రమాలు మందకొడిగా నడుస్తున్నాయి. నాకో,
ఫూహ్, ఇతర మారుమూల ప్రాంతాల్లో హెలికాప్టర్లు ప్రయాణికుల్ని తరలించేందుకు
వాతావరణం అనుకూలించేవరకు అంటే మధ్యాహ్నం వరకూ వేచి ఉన్నాయి. సంగ్లాలో మకాం
వేసి ఉన్న జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్‌డిఆర్ఎఫ్) భూమార్గం ద్వారా
యాత్రికుల్ని తరలించడం ప్రారంభించింది.
హిమాచల్ ప్రదేశ్‌లో దాదాపు రెండువేల రోడ్లు వర్షాలకు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కిన్నౌర్, కాజా, సిర్‌మార్ జిల్లాలకు అపార నష్టం సంభవించింది. వాటిల్లిన నష్టాన్ని రూ 600 కోట్లుగా అంచనా వేశారు. కిన్నౌర్‌లో ఇంతవరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. సిమ్లా, సిర్మోర్ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. పదివేల పశువులు కనిపించడం లేదు. ఉధృతంగా కురిసిన మంచులో, భారీ వర్షాలకు అవి మరణించి ఉండవచ్చంటున్నారు.
భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఇంతవరకు ఎన్నడూ చేపట్టనంతటి భారీ స్థాయిలో ఉత్తరాఖండ్ వరదల్లో సహాయ కార్యక్రమాల్ని చేపట్టిందని ఐఎఎఫ్ ఉన్నతాధికారి ఒకరు ఆదివారం చెప్పారు. 'బాధితులందరినీ తరలించేందుకు ఇప్పటి సహాయ కార్యక్రమాలు ఇంకా ఒక వారం కొనసాగే సూచనలున్నాయి. ఐఏఎఫ్ చరిత్రలోనే ఇది అతి పెద్ద సహాయ కార్యక్రమం' అని వైమానిక కమెడోర్ ఇస్సార్ చెప్పారు. రోజూ 30 హెలికాప్టర్లు పనిచేస్తున్నాయన్నారు.

No comments