అన్ని విధాలా సాయం
ఉత్తరాఖండ్‌లో వరదలకు దారుణంగా దెబ్బతిన్న ప్రాంతాల పునర్నిర్మాణానికి 
కేంద్రం దీర్ఘకాలిక ప్రణాళికపై కసరత్తు చేస్తోందని కాంగ్రెస్ నాయకురాలు 
అంబికాసోనీ ఆదివారం చెప్పారు. 'ఈ ఆపత్సమయంలో దేశం మొత్తం ఉత్తరాఖండ్‌కు 
సంఘీభావం ప్రకటిస్తోంది' అని ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన 
కార్యదర్శి, కాంగ్రెస్ అధ్యక్ష కార్యాలయం ఇన్‌ఛార్జి అంబికా సోనీ తెలిపారు.
 రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోనీ మొదటిసారి 
ఇక్కడికి వచ్చారు. పార్టీ కోశాధికారి మోతీలాల్ వోరా, హర్యానా ముఖ్యమంత్రి 
బిఎస్ హుడాతో కలిసి విపత్తు సంభవించిన ప్రాంతాలకు వచ్చిన సోనీ సహాయ 
కార్యకలాపాలను సమీక్షించారు. ఉత్తరాఖండ్‌కు అన్ని విధాలా సాయం చేస్తామని 
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. కేదార్‌నాథ్ సమీపంలోని 
రంబాడా, గౌరీగావ్‌లలో హెలికాప్టర్లు దిగేందుకు హెలీ ప్యాడ్‌లు నిర్మించారు.
 కేదార్‌నాథ్ సమీపంలోని గౌరీగావ్, రాంబాడలలో రెండు హెలీప్యాడ్‌లను 
నిర్మించారు.
 
 

No comments