ఈ విషయం టీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్‌కు తెలిసిందే
రాష్ట్ర విభజన జరగదని, తెలంగాణ రాదని, ఈ విషయం టీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్‌కు
తెలిసిందేనని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్
జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని అన్నారు. ఒకవేళ
విడిపోతే మూడు రాష్ట్రాలు చేయాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌ను ప్రత్యేక
రాష్ట్రంగా చేసి సంగారెడ్డితో పాటు హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల పరిధిలో
ఉన్న ప్రాంతాలను అందులో కలపాలని ఆయన కోరారు. హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రం
కావాలని కోరుతున్న మంత్రులు దానం, ముఖేష్‌లకు తాను పూర్తి మద్దతు
ఇస్తున్నట్టు ఆయన తెలిపారు.
No comments