ప్రత్యేక హైదరాబాద్
ప్రత్యేక హైదరాబాద్ రాష్ట్ర నినాదానికి తాను కట్టుబడి ఉన్నానని, ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి పలు మార్లు తీసుకెళ్లానని మంత్రి దానం నాగేందర్ తెలిపారు. దాడులతో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తే.. తెలంగాణవాదానికే నష్టమన్నారు. రాష్ట్ర విభజన విషయంలో ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నారని, తనతోపాటు మంత్రి ముఖేష్ మాత్రం ప్రత్యేక హైదరాబాద్ రాష్ట్ర వాదనను వినిపించామని తెలిపారు.
ఈ విషయంపై పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కూడా కలిశామని, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ అజాద్‌తో చర్చిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ ప్రాంతవాసుల మనోభావాలకు అనుగుణంగానే తాను ప్రత్యేకరాష్ట్రాన్ని కోరుతున్నట్టు చెప్పారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే మాత్రం అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ నుంచి తమను అఖిలపక్షానికి పిలవకపోవడం పట్ల తాను, ముఖేశ్ గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశామని అన్నారు. తాను స్థానిక కార్పొరేటర్ భారతీ నాయక్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తుంటే.. వాటికి ఆటంకం కలిగించేలా తమపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించడం మంచిది కాదన్నారు. ఈ కారణంగా అభివృద్ధి కార్యక్రమాల్లో తాను పాల్గొనలేకపోయానని, దీనిపై భారతీనాయక్ సహా తమ పార్టీ కార్యకర్తలు మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తారని అన్నారు. కాగా.. రాష్ట్ర వ్యవహారాలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లేందుకు వీలుగా దానం గురువారం ఢిల్లీకి వెళ్లారు.

No comments