1

Breaking News

దానం నాగేందర్ కాన్వాయ్‌పై తెలంగాణవాదు దాడి

 కార్మికశాఖ మంత్రి దానం నాగేందర్ కాన్వాయ్‌పై తెలంగాణవాదు లు గురువారం దాడికి యత్నించారు. దాంతో మంత్రి కిం దకు దిగి, వెంబడించి ఇద్దరు ఆందోళనకారులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మంత్రుల క్వార్టర్స్‌లో గురువారం ఉ దయం సమావేశమయ్యారు. విషయం తెలిసిన తెలంగా ణవాదులు నిరసన వ్యక్తం చేసేందుకు అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న కార్మిక మం త్రి దానం నాగేందర్ కాన్వాయ్‌ని గమనించారు. 

సీమాం ధ్ర తొత్తు... తెలంగాణ ద్రోహి అంటూ కాన్వాయ్‌పై దాడి కి ప్రయత్నించారు. వెంటనే మంత్రి కారు ఆపి కిందికిది గి.. స్వయంగా ఆందోళనకారులను వెంబడించారు. వారి లో ఇద్దరిని పట్టుకుని మంత్రి, ఆయన అనుచరులు వారిపై పిడిగుద్దులు కురిపించారు. బంజారాహిల్స్ ఏసీపీ శంకర్‌రెడ్డి అక్కడికి చేరుకొని ఆందోళనకారులను స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ విద్యార్థి సంఘాల ప్రతినిధులు మంత్రుల క్వార్టర్స్ వద్దకు చేరుకొని దానం దిష్టిబొమ్మను తగులబెట్టారు. 

కొద్దిసేపటికి పలువురు ఓయూ విద్యార్థులు, తెలంగాణ జాగృతి నేతలు అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. మరోవైపు.. మంత్రి దానం నాగేందర్ తమపై దాడి చేయడంతోపాటు తుపాకీతో బెదిరించారని నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ కార్యదర్శి తిరుపతివర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, తెలంగాణ రాష్ట్రం ఇస్తే రాజీనామా చేస్తానన్న మంత్రి విశ్వరూప్ వ్యాఖ్యలకు నిరసనగా నగరంలోని ఆయన నివాసాన్ని తెలంగాణ వాదులు ముట్టడించారు.

No comments