ఇప్పుడు పరిస్థితులు ఆ విధంగా లేవు
మంత్రి టీజీ వెంకటేశ్ ఢిల్లీలో అంత ముభావంగా ఎందుకున్నారు? 'కేంద్రం తెలంగాణ ఇచ్చేలా ఉంది!' అని ఆయనకు ఎలా అర్థమైంది? సీమాంధ్ర మంత్రులతో కాంగ్రెస్ పెద్దలు వయలార్ రవి, గులాం నబీ ఆజాద్ ఏం చెప్పారు? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు లభించాయి. 'ఆంధ్రజ్యోతి' అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ సమాచారాన్ని రాబట్టింది. సీమాంధ్రలో జగన్ హవా కనిపిస్తున్నందున... కనీసం తెలంగాణలోనైనా పార్టీని కాపాడుకోవాలన్న ఆలోచన అధిష్ఠానంలో కనిపిస్తోంది.
చివరికి... 'మీరు కూడా పోతారా! పోతే పోండి' అంటూ మంత్రులతోనే వయలార్ రవి అన్నట్లు తెలిసింది. రాష్ట్రాన్ని విభజిస్తే రాష్ట్ర ప్రభుత్వం పడిపోతుందని కూడా తమకు తెలుసని ఆయన చెప్పేశారు. మొత్తానికి... 'రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి' అనే విన్నపంతో వెళ్లిన మంత్రులకు చేదు అనుభవమే మిగిలింది. ఏరాసు, టీజీలు ఏమన్నారు... దీనికి వయలార్ రవి, ఆజాద్ ఏమని బదులిచ్చారంటే...
టీజీ, ఏరాసు: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి.
వయలార్: సీమాంధ్రలో జగన్ ప్రాబల్యం ఉంది. తెలంగాణలో సెంటిమెంట్ ఉంది. రాష్ట్ర విభజన జరగకుండా సమైక్యంగా ఉంచితే మీరెన్ని సీట్లు ఇస్తారు!
ఏరాసు, టీజీ: రాష్ట్ర విభజన జరిగితే ఆ మరుక్షణం రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది.
వయలార్: ఆ విషయం మాకు తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని మాకూ సమాచారం ఉంది. చాలా మంది జగన్ వెంట వెళ్లిపోతారన్న సమాచారం ఉంది. మీరంతా వెళ్లిపోతారా? వెళ్లిపోండి. ఇప్పుడే వెళ్లిపోతారా వెళ్లిపోండి. మేం కొత్త టీమ్‌ను రెడీ చేసుకుంటాం. మీరెన్ని సీట్లు ఇస్తారో చెప్పలేదు. తెలంగాణ ఇస్తే అక్కడ 16 ఎంపీ స్థానాలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో గెలిచిన స్థానాల వల్లే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉంది. అసలు, మీరెప్పుడైనా ఉద్యమాలు చేశారా? ఇప్పుడు అంతా అయిపోయాక వచ్చి మాట్లాడుతున్నారు. అఖిలపక్షంలో అన్ని పార్టీలూ తెలంగాణకు సానుకూలంగానే చెప్పాయి కదా? ఇంకేం చేస్తాం? మేం అన్ని అంశాలూ చర్చించాలి.
ఏరాసు: రాయలసీమ నీటి సమస్య గురించి చర్చించాలి
వయలార్: తుంగభద్ర బోర్డుతో ఒప్పందాల్లేవా?
ఏరాసు: ఒప్పందాలు ఉన్నాయి. కానీ, మాకు నీరు రావడంలేదు. మమ్మల్నే దోషులుగా చూస్తున్నారు. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. నీటి సమస్యపైనా మాట్లాడాలి.
వయలార్: ఇవన్నీ వదిలేయండి. ఇక మాటలు వద్దు
ఆజాద్‌తో...
ఏరాసు, టీజీ వెంకటేశ్: తెలంగాణపై తేల్చాలి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందే.
ఆజాద్: అవును. కానీ, ఇప్పుడు పరిస్థితులు ఆ విధంగా లేవు. 2009 డిసెంబర్ 9 నాటి ప్రకటన తప్పే. ఆ ప్రకటన రాకుండా చూడాల్సింది. ఇప్పుడు కూడా నెల రోజుల్లో తెలంగాణపై తేలుస్తామని కాకుండా... హోంశాఖ బాధ్యతలు కొత్తగా స్వీకరించినందున మరికొంత సమయం పడుతుందని షిండే చెప్పి ఉంటే బాగుండేది. నేను కూడా అదే చెప్పాను. నెల రోజుల్లో తేలుస్తామన్న ప్రకటన సరికాదు. కొంత సమయం తీసుకోవాల్సింది. అయినా, తెలంగాణ ఎంపీలు యూపీఏ భాగస్వామ్య నేతలను కలసి ప్రత్యేక రాష్ట్రానికి ఒప్పించే పని చేశారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి నుంచి కూడా ఒత్తిడి బాగా ఉంది. ఏం చేస్తాం!
మేం నిలబెడతాం: హరీశ్
తెలంగాణకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత రాజీనామాలతో అడ్డుకోవాలని చూస్తే... ప్రభుత్వాన్ని తాము ఆదుకుంటామని టీఆర్ఎస్ నేత హరీశ్ రావు స్పష్టం చేశారు. 'రాష్ట్రం రాకుండా సీమాంధ్ర నేతలు రాజీనామాలతో ప్రభుత్వాన్ని పడగొడితే ఏం చేస్తారు?' అనే ప్రశ్నకు 'ప్రభుత్వాన్ని కాపాడి తెలంగాణ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం'' అని హరీశ్ చెప్పారు.

No comments