పొట్టకూటి కోసం వచ్చిన సీమాం«ద్రులు
తెలంగాణ రాష్ట్రమిచ్చి హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తామంటే ఊరుకోబోమని టీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్‌రావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌పై పూర్తి హక్కులు తెలంగాణ ప్రజలవేనని, ఇతరులు పెత్తనం చెలాయిస్తే ఊరుకోమని మెదక్ జిల్లా సిద్దిపేటలో హెచ్చరించారు. కొత్త రాజధాని ఏర్పాటు చేసుకునేదాకా సీమాంధ్ర వారు హైదరాబాద్‌నుంచే పాలనాపరమైన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చునన్నారు.
హైదరాబాద్‌లో ఉండే వారందరినీ తెలంగాణ రాష్ట్రం కాపాడుకుంటుందని చెప్పారు. న్యాయబద్ధమైన వ్యాపారం చేసే వారికి ఎలాంటి అడ్డంకులు ఉండవన్నారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ చరిత్రకెక్కుతుంది లేకపోతే చరిత్ర హీనంగా మిగులుతుందని తెలిపారు. తెలంగాణకు ఇస్తామన్న ప్యాకేజీలు ఆంధ్రాకే ఇవ్వాలని హైదరాబాద్ రాజధానితో కూడిన తెలంగాణ తమకివ్వాలని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఇస్తామంటున్న మాటలు రావడంతోనే సీమాం«ద్రులు వైషమ్యాలు సృష్టించడానికి చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
పొట్టకూటి కోసం వచ్చిన సీమాం«ద్రులు తమకు వ్యతిరేకం కాదని, పొట్టలు కొట్టే వారే వ్యతిరేకమని చెప్పారు. రాజకీయంగా శాసిం చి తెలంగాణ తెచ్చుకుంటామ న్నారు. తెలంగాణ అంశం తుది దశకు చేరుకోవడంతోనే విధ్వంసాలు, రక్తపాతాలు సృష్టిస్తామని తెలంగాణకు అనుకూలంగా చెప్పిన పార్టీలే మాట్లాడుతున్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అంశం మళ్లీ తుదిదశకు చేరుకున్న సమయంలో అందరు జాగ్రత్తగా ఉండాలని, ప్రత్యేక రాష్ట్ర గెజిట్ వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని పిలుపు నిచ్చారు.
కొందరు హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రం చేయాలని చెబుతున్నారని, అలా చెప్పడానికి అది ఎవరి జాగీరని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటి వరకు తెలంగాణ ఊసే ఎత్తని నేతలు ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు గొట్టం మంత్రులు హైదరాబాద్ రాష్ట్రం ఇవ్వాల్సిందే అంటే ఏర్పడిపోతుందా ? అని వ్యాఖ్యానించారు. మంత్రి శైలజానాథ్ దళిత ద్రోహి అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. కాగా, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేవారికి మంత్రి దానం ఆదర్శమని శ్రవణ్ మండిపడ్డారు.

No comments