కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్
హైదరాబాద్‌ను మినమాయించి తెలంగాణ రాష్ట్రం ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసి తెలంగాణ, సీమాంధ్రలకు వేర్వేరు రాజధానులు ఇవ్వాలని తెలిపారు.
ఈ సందర్భంగా మంగళవారం రాయపాటి మాట్లాడుతూ తాము సమైక్యాంధ్రనే కోరుకుంటున్నామని, ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాదును వదులుకునే ప్రసక్తి లేదన్నారు. హైదరాబాదులేని విభజనతో పలు సమస్యలు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ నెల 28వ తేది లోగా తెలంగాణ సమస్యకు పరిష్కారం వస్తుందని తాను భావించడం లేదన్నారు. అన్ని విధాలా అభివృద్ధి చెందిన హైదరాబాదును ఎలా వదులుకుంటామన్నారు. అధిష్టానం మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని మూడొంతుల మంది ప్రజలు సమైక్యాంధ్రనే అంటున్నారన్నారు.
తెలంగాణపై వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎలాంటి అభిప్రాయాన్ని చెప్పలేదన్నారు. మజ్లిస్ పార్టీ కూడా తెలంగాణ కోరుకోవడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖలో ఏముందో తనకు తెలియదన్నారు. అయితే తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్లు టిడిపి చెబుతోందన్నారు. అయితే ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మనస్ఫూర్తిగా తెలంగాణ రావాలని లేదన్నారు.
ఈనెల 17న హైదరాబాద్‌లో సీమాంధ్ర నేతల సమావేశం జరుగుతుందని, ఆ భేటీని అడ్డుకుంటామని చెప్పడానికి కవిత ఎవరని ఆయన ప్రశ్నించారు. ఆలాంటి ప్రకటనలుచేయడం సరికాదని అన్నారు. ఆ భేటీలో తీసుకున్న నిర్ణయాలను అధిష్ఠానం దృష్టికి తీసుకువెళతామని, సీమాంధ్ర ప్రజల మనోభావాలను తెలియజేస్తామని, రాష్ట్రాన్ని సమైక్యాంగా ఉంచాలని చెబుతామని రాయపాటి అన్నారు.

No comments