పండుగ కష్టాలు
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు పండుగ రోజు కూడా కష్టాలు తప్పలేదు. నగర శివారు ప్రాంతాల్లో వివిధ పనుల నిమిత్తం ఉన్న ప్రజానీకం సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లడటానికి మూడు రోజుల నుంచి వాహనాలు సరిపోక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పక్కనున్న ఊళ్ల వాళ్లు కూడా సొంతూళ్లకు వెళ్లడానికి అవస్థలు పడాల్సి వచ్చిం ది. పండుగ రోజైనా ప్రశాంతంగా ప్రయాణించాలనుకున్న ప్రయాణికులకు నిరాశే మిగిలింది. భోగి పండుగ అయిన ఆదివారం రోజు ఊళ్లకు ప్రయాణమైన ప్రయాణికులు నరకాన్ని చవిచూశారు.
ఆదివారం రోజు ఘట్‌కేసర్, రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్‌లలో కిక్కిరిసిన ప్రయాణికులు కనిపించారు. ఎక్కడ చూసినా జనంతో రైల్వే స్టేషన్లు, బస్‌స్టేషన్లు కిటకిట లాడాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఐనవోలు జాతరకు తరలివెళ్లే భక్తులతో బస్సులు, ప్రయివేటు వాహనాలు, రైళ్లు కిక్కిరిసిన ప్రయాణికులతో ప్రయాణించాయి. నగరం నుం డే వాహనాలు నిండిపోయి వస్తుండటంతో ఘట్‌కేసర్‌లో ఎక్కేందుకు స్థలం లేక, గమ్య స్థానాలకు చేరడమే ముఖ్యంగా భావించిన ప్రయాణికులు టాప్‌పైకి ఎక్కి ప్రయాణించాల్సి వచ్చింది.
ఇదే అదనుగా భావించి కొంత మంది ప్రయివేట్ ట్రావెల్స్ చార్జీలను రెండింతల చేసి సొమ్ము చేసుకుంటున్నాయి. దీనికి తోడు ఛార్జీలు కూడా రెండు, మూడింతలు పెంచి వసూళ్లు చేయడంతో ప్రయాణికులు లబోదిబోమన్నారు. ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్‌లో శుక్ర, శనివారాలకంటే భోగి పండుగ రోజు అయిన ఆదివారం రోజు అధిక సంఖ్యలో ప్రయాణికులు కనిపించారు.

No comments