సైన్యం ఎప్పుడూ సిద్ధం
దేశ సరిహద్దు భద్రత కోసం సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, శత్రువు కుట్రలను భగ్నం చేస్తామని భారత ఆర్మీ చీఫ్ బిక్రం సింగ్ పేర్కొన్నారు. భద్రత కోసం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. నియంత్రణ రేఖ వెంబడి సైనికులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు చెప్పారు.
65వ జాతీయ సైనిక దినోత్సవ వేడుకలు మంగళవారం ఉదయం ఢి ల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమరవీరులకు బిక్రం సింగ్, సైనికులు నివాళులర్పించారు. ఆర్మీ చీఫ్ బిక్రమ్ సింగ్ సైనికుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం సైనికులకు శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడులూ మానవ హక్కుల విషయంలో ప్రపంచంలో భారత సైన్యానికి మంచి గుర్తింపు ఉందని బిక్రం సింగ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చేసిన సైనిక విన్యాసాలు అలరించాయి
కాగా సరిహద్దు వద్ద కాల్పుల విరమన ఒప్పందం ఉల్లంఘనపై సోమవారం బ్రిగేడియర్ స్థాయి చర్చలు అనంతరం లెఫ్ట్‌నెంట్ జనరల్ పర్నాయక్ మాట్లాడుతూ పాకిస్తాన్ వాస్తవం అంగీకరించకుండా.. ఎప్పుడూ కట్టుకథలు అల్లుతుందని నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పర్నాయక్ ఆరోపించారు. ప్లాగ్ మీటింగ్ తర్వాత కూడా పాక్ మొండి వైఖరి ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణను గౌరవిస్తామని, కవ్వింపు చర్యలకు పాల్పడితే తిప్పికొడుతామని పాక్‌కు చెప్పామని ఆయన తెలిపారు. ప్లాగ్ మీటింగ్ తర్వాత మూడు సార్లు పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని మండిపడ్డారు. భారత సైన్యం తొందరపాటుగా, ఆగ్రహంతో స్పందించదని, తమకు ఓ ప్రణాళిక ఉంటుందని తెలిపారు.

No comments