1

Breaking News

స్వామి కమలానంద భారతికి శుక్రవారం పోలీసులు వాయిస్‌ రికార్డు పరీక్షలు

చర్లపల్లి జైలులో ఉన్న స్వామి కమలానంద భారతికి శుక్రవారం పోలీసులు వాయిస్‌ రికార్డు పరీక్షలు నిర్వహించారు. సిట్‌ పోలీసులు, ఇద్దరు న్యాయవాదులు, ఫోరెన్సిక్‌ నిపుణులు కలిసి పది నిమిషాలపాటు ఈ పరీక్షలు నిర్వహించారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై ఆయన్ను అరెస్టు చేయగా కోర్టు 14 రోజుల జుడీషియల్‌ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. ఇందిరాపార్కువద్ద ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై చేసిన వ్యాఖ్యలపై టేపులను సేకరించిన పోలీసులు ఆ టేపుల్లో ఉన్న గొంతును కమలానంద భారతి గొంతుతో పోల్చి చూసేందుకు ఈ పరీక్షలు నిర్వహించారు.

No comments