1

Breaking News

రైల్వేలకు చెందిన షేర్లు పుంజుకున్నాయి.

రివర్స్‌ గేర్‌లో రైల్వే షేర్లు
ముంబయి : కేంద్ర ప్రభుత్వం రైల్వే చార్జీలను పెంచుతున్నట్లు బుధవారం నాడు ప్రకటించింది. రైల్వేశాఖ మంత్రి పవన్‌కుమార్‌ బన్సాల్‌ అన్నీ తరగతులకు చెందిన రైల్వే చార్జీలను పెంచుతున్నట్లు చెప్పారు. గత పది సంవత్సరాల నుంచి చార్జీలు పెంచలేదని భద్రతతో పాటు ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపర్చేందుకు చార్జీలు పెంచడం తప్పని సరి అని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. దీంతో బుధవారం నాడు రైల్వేలకు చెందిన షేర్లు పుంజుకున్నాయి. అయితేే యూపీఏకు మద్దతు తెలుపుతున్న మిత్తప్రక్షం సభ్యుతు డీఎంకే చీఫ్‌ ఎం కరుణానిధి మాత్రం రైల్వే చార్జీలు పెంచడం వల్ల పేద వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఈవిషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తన ఎంపీలు తీసుకెళతారని అన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో తన పార్టీకి చెందిన మంతురలు కలిసి నిరసన వ్యక్తం చేస్తారని... ఎట్టి పరిస్థితుల్లో చార్జీలు పెంచడానికి తాముఅనుమతించమని డీఎంకే బాస్‌ చెప్పారు.

ఇదిలా ఉండగా రైల్వేలకు సంబంధించిన షేర్లు మాత్రం గత వారం బోల్తా పడ్డాయి. కెర్మాక్స్‌ మైక్రో సిస్టవమ్స్‌ (ఇండియా )6.45 శాతం క్షీణించి రూ.76.85 వద్ద ముగిసింది. బుధవారం నాడు రైల్వేశాఖ మంత్రి రైల్వేలు చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించగానే దీని షేరు నిన్న 4.38 శాతం పెరిగింది.
అలాగే కళింది రైల్‌నిర్మాన్‌ ఇంజినీర్స్‌ 4.77 శాతం క్షీణించి రూ.103.80కి చేరింది. నిన్న 3.76 శాతం పెరిగింది. అలాగే టైటాగర్‌ వ్యాగన్స్‌ 3.61 శాతం క్షీణించి రూ.363.65కు పడిపోయింది. నిన్న 1.22 శాతం పెరిగింది. టెక్స్‌మాకో రైల్‌ అండ్గ ఇంజినీరింగ్‌ 2.42 శాతం క్షీణించి రూ.70.60 వద్ద నమోదు కాగా నిన్న 2.05 శాతం పెరిగింది. హింద్‌ రెక్టిఫైర్స్‌ 1.43 శాతం క్షీణించి రూ.65.40 వద్ద ముగియగా బుధవారం నాడు 4.57 శాతం పెరిగింది. మొత్తానికి చూసుకుంటే కరుణానిధి ఎఫెక్ట్‌ రైల్వే షేర్ల చూపిందని చెప్పుకోవచ్చు.

No comments