పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ
తళుక్కుమన్న ఐటీ షేర్లు
ముంబయి
: గత రెండు వారాల నుంచి లాభాలతో కొనసాగిన స్టాక్ మార్కెట్‌కు ఎట్టకేలకు
తెరపడింది. మదుపరులు పెరిగిన షేర్లపై లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. గత
శుక్రవారం నుంచి మార్కెట్‌లో క్యూ3 ఫలితాల వెలువడ్డం ప్రారంభమైంది. తొలుతగా
ఇన్ఫోసిస్ శుక్రవారం నాడు ఫలితాలు ప్రకటించి క్యూ3 సీజన్‌కు తెరలేపింది.
ఇన్ఫీ మార్కెట్ అంచనాలను మించిపోయింది. షేరు కూడా 17 శాతం పెరిగింది.
శుక్రవారంతో ముగిసిన స్టాక్ మార్కెట్లో సూచి 120 పాయింట్ల వరకు
క్షీణించింది. మార్కెట్ ముగిసే నాటికి సూచి 19,663.64 వద్ద ముగిసింది.
కేపిటల్‌గూడ్స్, కన్సుమర్ డ్యూరబుల్స్, ఎఫ్‌ఎంసీజీ, విద్యుత్, లోహ,
రియల్టీ రంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. కాగా ఐటీ
రంగానికి చెందిన షేర్లు మాత్రం భారీగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్ తన
రెవెన్యూ గైడెన్స్‌ను పెంచింది. రెండవ శ్రేణికి చెందిన షేర్లపై మదుపరులు
పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు పాల్పడ్డారు.
ఈ వారం మార్కెట్ ప్రారంభం నుంచి నిలకడగానే ప్రారంభమై తర్వాత రెండు వారాల గరిష్ఠానికి చేరింది. సూచి గరిష్ఠంగా 19,856.43 పాయింట్లకు చేరింది. అదే సూచి అదే స్థాయిలో కొనసాగలేకపోయింది. మదుపరులు క్యూ3 ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో తమ వద్ద ఉన్న షేర్లను వదిలించుకున్నారు. శుక్రవారం మార్కెట్ ముగిసే నాటికి సూచి 120.44 పాయింట్లు క్షీణించి 19,664.64 వద్ద ముగిసింది. అంతకు ముందు రెండు వారాల్లో సూచి సుమారు 542.08 పాయింట్లు పెరిగింది. నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ లేదా నిఫ్టీ కూఆ 6,000 మార్కుకు దిగువన 5,951.30 పాయింట్లకు చేరింది. నికరంఆ 64.85 పాయింట్లు క్షీణించింది. శుక్రవారం నాడు ఇన్ఫోసిస్ ఫలితాలు మెరుగ్గా ఉండటం వల్ల మార్కెట్ కాస్తా పుంజుకుంది. తర్వాత పారిశ్రాకోత్పత్తి గణాంకాలు పేలవంగా నమోదు కావడంతో పాటు ఎగుమతుల గణాంకాలను సూచి రివర్స్‌గేర్‌లోకి లాగాయి. ఎగుమతులు తగ్గుముఖం పట్టడంతో వాణిజ్యలోటు 17.6 బిలియన్ డాలర్లకు చేరాయి.
గత ఏడాది ఇదేకాలంలో వాణిజ్యలోటు 14.7 బిలియన్ డాలర్లు. సరిహద్దులో పాకిస్తాన్ సైనికులు భారతీయ సైనికులను కిరాతకంగా చంపివేయడం ఒక సైనికుడి తలను తమతో పాటు ఎత్తుకెళ్లడం దేశంలో పెద్ద ఎత్తున కలవరపరిచింది. దీని ప్రభావం మార్కెట్‌తో చూపించింది. మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 20,000 వద్ద నిఫ్టీ 6,000 పాయింట్ల కే పరిమితం అవవచ్చునని చెబుతున్నారు. మార్కెట్ పెద్ద ఎత్తున పుంజుకోవాలంటే ఇక రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా ఈ నెల 29వ తేదీన ద్రవ్యపరపతి సమీక్షా సమావేశంలో కీలక వడ్డీరేట్లను తగ్గిస్తేనే మార్కెట్ పుంజుకునే అవకాశం ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇదిలా ఉండగా విదేశీ సంస్థాగత మదుపరులు గత వారం మార్కెట్‌లో రూ.3,866.38 కోట్లు పెట్టుబడులు పెట్టాయి. బీఎస్‌ఈ 30 షేర్లలో 20 నష్టాలను మూటగట్టుకున్నాయి. మిగిలినవి లాభాలతో ముగిశాయి. భారీగా నష్టపోయిన షేర్ల విషయానికి వస్తే హెచ్‌యూఎల్ 6.60 శాతం, తర్వాత స్థానం బీహెచ్‌ఈఎల్
6.29 శాతం, ఎల్ అండ్ టి 5.91 శాతం, జిందాల్‌స్టీల్ 5.65 శాతం, హిందాల్కో 4.15 శాతం, బజాజ్‌ఆటో 3.97 శాతం, ఎన్‌టీపీసీ 3.87 శాతం, టాటాస్టీల్ 3.80 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 3.34 శాతం, ఐటీసీ 3.15 శాతం, టాటాపవర్ 3 శాతం, హీరో మోటోకార్ప్ 2.62 శాతం, రిల్ 2.49 శాతం, స్టెరిలైట్ ఇండస్ట్రీస్ 2.45 శాతం, గెయిల్ 1.84 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 1.55 శాతం, సిప్లా 1.30 శాతం కాగా లాభపడిన షేర్ల విషయానికి వస్తే ఇన్ఫోసిస్ 15.51 శాతం, టాటామోటార్స్ 4.70 శాతం, విప్రో 4.02 శాతం, ఒఎన్‌జీసీ 2.55 శాతం, మారుతి సుజుకీ 1.42 శాతం, కాగా బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ టర్నోవర్‌లు వరుసగా రూ.13,452.18 కోట్లు, రూ.64,590.36 కోట్లు కాగా అంతకు ముందు వారం రూ.11,432.15 కోట్లు, రూ.52,712.07 కోట్లు.

No comments