భారత ఆర్థిక వ్యవస్థ
భారత ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలపై ఎప్పటికప్పుడు తాజా
అంచనాలు వెలువడుతూనే ఉన్నాయి. 2050 నాటికి భారతదేశం ప్రపంచంలోని అతి పెద్ద
ఆర్థిక వ్యవస్థల్లో మూడోదిగా నిలుస్తుందని ప్రైస్ వాటర్‌హౌజ్ కూపర్స్
(పిడబ్ల్యుసి) అంచనా వేస్తుండగా సమీప భవిష్యత్తులో వృద్ధిరేటు విషయంలో
చైనాకు అతి చేరువ అవుతుందని ప్రపంచబ్యాంకు ఆర్థికవేత్తలు అంచనా
వేస్తున్నారు. రానున్న నాలుగు దశాబ్దాల కాలంలో సంపన్న దేశాల ఆర్థిక
వ్యవస్థల కన్నా ప్రపంచంలోని వర్థమాన ఆర్థిక వ్యవస్థలు వేగంగా అభివృద్ధి
చెందుతాయని పిడబ్ల్యుసి ఘంటాపథంగా చెబుతోంది. 2050 నాటికి ప్రపంచ ధోరణులు
బ్రిక్ దేశాలు-ఇతర దేశాలు : అవకాశాలు, సవాళ్లు పేరిట పిడబ్ల్యుసి నివేదిక
విడుదల చేసింది.
ఇటీవల ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతో ఆర్థిక కార్యకలాపాల కేంద్ర స్థానాల్లో మార్పులు వచ్చాయని, 2050 నాటికి అమెరికాను పక్కకు నెట్టి చైనా ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించవచ్చునని ఆ సంస్థ పేర్కొంది. 2050 నాటికి ర్యాంకుల పరంగా చైనా, అమెరికా, ఇండియా, బ్రెజిల్ ప్రపంచంలోని అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో వరుసగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. టర్కీ కూడా యూరోపియన్ ఆర్థిక వ్యవస్థల్లో అతి పెద్దదిగా అవతరించడంతో పాటు ఇండోనేసియా, నైజీరియా, వియత్నాం కూడా తమ ర్యాంకింగ్‌లు మెరుగుపరుచుకునే అవకాశం ఉన్నట్టు కూడా పేర్కొంది. కొనుగోలు శక్తి పరంగా జి 7 దేశాల స్థానాన్ని ఇ7 దేశాలు వశం చేసుకోవచ్చునంటూ ఇది 2020 కన్నా ముందుగానే జరగవచ్చునని కూడా తెలిపింది.
పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో జపాన్ స్థానాన్ని బ్రెజిల్ ఆక్రమించడంతో పాటు రష్యా, మెక్సికో, ఇండోనేషియాలు జర్మనీ, బ్రిటన్లను ర్యాంకింగ్‌లో పక్కకు నెట్టి ముందుకు దూసుకుపోయే అవకాశం ఉన్నదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ఏడు అగ్రగామి వర్థమానదేశాల కన్నా (ఇ7) జి7నే అధికంగా కుంగదీసిందని నివేదిక రచయితల్లో ఒకరైన పిడబ్ల్యుసి చీఫ్ ఎకనామిస్ట్ జాన్ హాక్స్వర్త్ తెలిపారు. అయితే స్థూల ఆర్థికాంశాలు, రాజకీయ అస్థిరతలు వర్థమాన దేశాల వృద్ధి అవకాశాలను దెబ్బ తీసే ప్రమాదం ఉన్నదని కూడా హెచ్చరించారు. తారాస్థాయికి దూసుకుపోతున్న విత్తలోటు భారత్, బ్రెజిల్‌లకు పెను సవాలుగా నిలుస్తుందని పేర్కొన్నారు.
చైనాతో నువ్వా నేనా...
భారత్ వృద్ధిరేటు విషయంలో సమీప భవిష్యత్తులో చైనాకు సమీపంలో నిలిచే అవకాశం ఉన్నదని ప్రపంచబ్యాంకు అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అవకాశాలు 2013 పేరిట విడుదల చేసిన నివేదికలో తెలిపింది. త్వరలోనే భారత్, చైనా, బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థలు పుంజుకుని అధిక వృద్ధి రేటు సాధించే దిశగా అడుగులు వేయవచ్చని ఆ నివేదికలో అంచనా వేశారు. 2015 నాటికి చైనాలో వృద్ధిరేటు 7.9 శాతం ఉంటే భారత వృద్ధిరేటు ఏడు శాతం వరకు ఉండవచ్చునని ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకనామిస్ట్ కౌశిక్ బసు అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నింటి వృద్ధి రేటు 2012లో సగటున 2.3 శాతం ఉండగా 2013లో 2.4 శాతం ఉండగలదని ఆయన అంచనా వేశారు. భారతదేశం వృద్ధిరేటు 2012లో 5.1 శాతానికి దిగజారినప్పటికీ 2013లో పుంజుకుని 6.1 శాతానికి చేరవచ్చునని ఆయన అన్నారు. 1978 లేదా 1980 నుంచి చైనా వృద్ధిరేటు అమిత వేగంగా ఉన్నదంటూ రెండు దశాబ్దాలకు పైబడిన తర్వాత కూడా ఇదే వేగం కొనసాగడం సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌లో అధిక వృద్ధి శకం 2003 తర్వాత ప్రారంభమయిందంటూ ఈ అధిక వృద్ధిశకం ప్రారంభమయి పదేళ్ళే అయినందువల్ల ఈ వేగం మరి కొంత కాలం కొనసాగుతుందని ఆయన అన్నారు.

No comments