ఆశలపై ఆర్‌బిఐ గవర్నర్ నీళ్లు చల్లారు.
వడ్డీ రేట్ల తగ్గింపుపై పారిశ్రామిక, వాణిజ్య రంగాలు పెట్టుకున్న ఆశలపై 
ఆర్‌బిఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు మరోసారి నీళ్లు చల్లారు. ఆర్థిక 
మంత్రిత్వ శాఖ, పారిశ్రామిక సంఘాలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నప్పటికీ
 వడ్డీరేట్ల తగ్గింపు ద్రవ్యోల్బణంతోనే ముడివడి ఉంటుందని ఆయన మరోసారి 
స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని 
తేల్చి చెప్పారు. కరెన్సీ నోట్‌పై ఆర్‌బిఐ ముద్రించే హామీని ఈ సందర్భంగా 
ఆయన ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఒక గ్రామం లాల్‌పూర్ కరౌతాలో 
ప్రజలకు చేరువయ్యేందుకు ఆర్‌బిఐ ఏర్పాటు చేసి న కార్యక్రమంలో దువ్వూరి 
పాల్గొన్నారు. వంటనూనెలు, ఆహార ఉత్పత్తులు, దుస్తులతో సహా అన్నిరకాల 
వస్తువుల ధరలు పెరిగిపోయాయని సుబ్బారావు అన్నారు. సమాజంలోని అన్నివర్గాల 
ప్రజలపైనా మరీ ముఖ్యంగా పేదలపైనా ద్రవ్యోల్బణం తన ప్రభావాన్ని చూపిస్తోందని
 ఆయన పేర్కొన్నారు.
గత రెండేళ్లుగా ద్రవ్యోల్బణాన్ని ఆర్‌బిఐ విజయవంతగానే అదుపులో ఉంచుతోందని, 
అయినప్పటికీ ఇంకా హెచ్చుస్థాయిలోనే ఉందని ఆయన చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని 
అదుపు చేయడమే ఇప్పు డూ, మున్ముందు కూడా ఆర్‌బిఐ ప్రథమ ప్రాధాన్యత అని 
చెప్పా రు. ఈ సందర్భంగా కరెన్సీ నోట్‌పై ఉండే హామీని ప్రస్తావించారు. 100 
రూపాయల నోట్‌పై నోట్ ఉన్న వ్యక్తికి 100 రూపాయలు చెల్లిస్తామనే హామీ కింద 
ఆర్‌బిఐ గవర్నర్ సంతకం ఉంటుందని, ద్రవ్యోల్బణం వల్ల రూపాయి కొనుగోలు శక్తి 
పడిపోతే హామీకి విలువలేకుండా పోతుందని గవర్నర్ వ్యాఖ్యానించారు. ఆయన 
వ్యాఖ్యలతో రేట్ల తగ్గింపుపై ఆశలు సన్నగిల్లినట్టేనని ఎనలిస్టులు 
అంటున్నారు.
ఇదిలా ఉండగా మంగళవారం నాడు లక్నో ఐఐఎంలో ఏర్పాటైన ఒక కార్యక్రమంలో 
సుబ్బారావు మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయి నుంచి 
దిగివచ్చినప్పటికీ ఇంకా పై స్థాయిలోనే ఉందని పేర్కొన్నారు. వినియోగ 
వస్తువులు, పారిశ్రామిక ఉత్పత్తుల ధరలు ఇంకా హెచ్చుస్థాయిలోనే ఉన్నాయని, 
ధరల పెరుగుదలలో వడి తగ్గినప్పటికీ ధరలు ఇంకా హెచ్చు స్థాయిలోనే ఉన్నాయని 
ఆయన వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక వృద్థి దశాబ్ద కాల కనిష్ఠ స్థాయిని తాకే 
అవకాశం ఉన్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ద్రవ్యపరంగా గానీ విధానాల 
పరంగా గానీ ఉద్దీపన చర్యలకు అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. ద్రవ్యలోటు, 
బడ్జెట్‌లోటు, కరెంట్ అకౌంట్ ఖాతాలో అగా ధం, మందగించిన ఎ గుమతులు, అరకొరగా 
ఉన్న ఇన్వెస్ట్‌మెంట్లు.. వీటిని ప్రస్తావిస్తూ పరిస్థితి ఆందోళనకరంగా 
ఉన్నప్పటికీ ఉద్దీపనలకు చోటులేదని చెప్పారు. డిసెంబర్‌లో హోల్‌సేల్ ధరల 
సూచీ మూడేళ్ల కనిష్ఠ స్థాయి 7.18 శాతాన్ని తాకడంతో జనవరి 29న ప్రకటించే 
ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్‌బిఐ రేట్లను తగ్గించడం ఖాయమన్న అంచనాలు 
బలపడ్డాయి. ద్రవ్యోల్బణంతో నిమిత్తం లేకుండా రేట్ల తగ్గింపునకు ఆర్‌బిఐ 
చర్యలు తీసుకోని పక్షంలో ఆర్థిక వృద్ధి కుప్పకూలుతుందని పారిశ్రామిక, వాణి 
జ్య రంగాలు హెచ్చరిస్తున్నాయి.
ఆర్థిక మంత్రి చిదంబరం కూడా రేట్ల తగ్గింపు డిమాండ్‌కు 
వత్తాసునిస్తున్నారు. బ్యాంకర్లు కూడా ఇటీవల ఆర్‌బిఐ గవర్నర్‌తో జరిగిన 
సమావేశంలో ఆర్థిక వృద్థిపై ఫోకస్‌పెట్టాలని, నగదు నిల్వల నిష్పత్తిని, రెపో
 రేటును తగ్గించాలని గట్టిగా కోరారు. ద్రవ్యోల్బణం భయాలు ఉన్నప్పటికీ, 
వృద్ధికే పెద్దపీట వేయాలన్నది తమ అభిమతమని వారు తేల్చిచెప్పారు.
 
 

No comments