1

Breaking News

రైతులకు గిట్టుబాటు

రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ఎక్కడ కొనుగోలు చేసిన బియ్యాన్ని అక్కడే 'మన బియ్యం' పథకం ద్వారా అందిస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. నగదు బదిలీ పథకం అమలైన తర్వాత కూడా మన బియ్యం పథకం అమలు చేస్తామని సీఎం చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగే చేపట్టిన 'మన బియ్యం' పథకాన్ని నగరంలోని తెలుగు లలిత కళా తోరణంలో బుధవారం ఉదయం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. లబ్దిదారులకు ముఖ్యమంత్రి బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ విపక్షాల తరహాలో అధికారం కోసం ఉచిత వాగ్ధానాలు తాను చేయనని చెప్పారు. పేదలకు ఇంకా అవసరమైన సరుకులను తక్కువ ధరకు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, శ్రీధర్‌బాబు, దానం నాగేందర్, స్థానిక ఎంపీలు, పలువురు నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో పండించిన బియ్యం ఇక్కడే వినియోగానికి వీలయ్యే ఈ పథకం కింద కిలో బియ్యం ఒక రూపాయికే నాణ్యమైన బియ్యం సరఫరా చేయనున్నారు. తొలి విడతగా ఏడు జిల్లాల్లో అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రయోగాత్మకంగా ఈరోజు నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాలో ఈ పథకాన్ని అమలు జరగనుంది. అర్హులైన తెల్ల రేషన్ కార్డు దారులకు అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 'మన బియ్యం' పథకాన్ని ప్రారంభించింది.

No comments