1

Breaking News

వాహనాల నకిలీ ఇన్స్యూరెన్స్‌ డాక్యుమెంట్లు

నగరంలో వాహనాల నకిలీ ఇన్స్యూరెన్స్‌ డాక్యుమెంట్లు తయారు చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి ఓ కంప్యూటర్‌, కలర్‌ ప్రింటర్‌, రెండు రబ్బర్‌ స్టాంపులు, బీమా కంపెనీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ కంపెనీలైన రిలయన్స్‌, బజాజ్‌ అలియాన్స్‌, న్యూ ఇండియా ఇన్స్యూరెన్స్‌ కంపెనీలకు సంబంధించిన పత్రాలను సృష్టించి రూ. 10 వేల విలువ చేసే పత్రాలను వెయ్యి రూపాయలకే విక్రయిస్తున్నారు. వీరి వ్యాపారాన్ని గమనించిన న్యూ ఇండియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు రెక్కీ నిర్వహించి నలుగురు సభ్యులు గల ముఠాను అరెస్టు చేశారు.

No comments