మహిళా కార్యకర్తలకు చాకుల
శివసేన అధినేతగా దివంగత బాల్‌థాక్రే తనయుడు ఉద్ధవ్ థాక్రే బుధవారం పగ్గాలు చేపట్టారు. బుధవారం బాల్‌థాక్రే జయంతిని ఘనంగా నిర్వహించారు. ముంబైలోని శివసేన భవన్‌లో ఈ సందర్భంగా జరిగిన పార్టీ జాతీయ కార్యనిర్వాహక వర్గ సమావేశంలో ఉద్ధవ్‌థాక్రేను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అయితే అధ్యక్షుడిగా ఉద్ధవ్ నియామకమైనప్పటికీ, ప్రముఖ్ అన్న హోదా దివంగత బాల్‌థాక్రేకే పరిమితమని పార్టీ స్పష్టం చేసింది. లాల్‌బాగ్‌లో జరిగిన బాల్‌థాక్రే జయంతి ఉత్సవాల్లో భాగంగా శివసేన మహిళా కార్యకర్తలకు చాకులను పంచిపెట్టింది. భద్రత కరువైన నేటి సమాజంలో ఆత్మరక్షణకు ఈ చాకులు మహిళలకు ఉపయోగపడుతాయని శివసేన అభిప్రాయపడింది. ప్రతి మహిళ తన బ్యాగులో లిప్‌స్టిక్కులకు బదులు చాకులు పెట్టుకోవాలని, ముప్పు పొంచి ఉందన్న అనుమానం వచ్చినప్పుడు ఆత్మరక్షణ కోసం వాటిని ఉపయోగించాలని శివసేన నేతలు సూచిస్తున్నారు.
No comments