‘ఒంగోలు గిత్త’.
రామ్ కథానాయకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఒంగోలు గిత్త’. చిత్రాన్ని పిబ్రవరి 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నామని నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ తెలిపారు. ఈ చిత్రం పాటలు ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. అంతేగాక ఈ చిత్రం బిజినెస్ లోనూ రామ్ గత చిత్రాలను దాటు తోందని, చాలా ఉత్సాహంగా బిజినెస్ జరుగు తున్నట్లు ట్రేడ్‌లో వినపడుతోంది. ఈ చిత్రం గురిం చి దర్శకుడు భాస్కర్ మాట్లాడుతూ... మిర్చి యార్డ్ నేపథ్యంలో సాగే మాస్ ఎంటర్‌టైనర్ ‘ఒంగోలు గిత్త’. ఇందులో రామ్ పాత్ర చిత్రణ కొత్త తరహాలో ఉంటుంది. నా గత చిత్రాల తరహాలో సున్నితమైన భావోద్వేగాలుంటూనే మాస్ ప్రేక్షకులని ఆకట్టుకునే సినిమా ఇది. మిర్చి యార్డుకు రామ్ పాత్రకు ఉన్న సంబంధం ఏమిటనేది తెరపైన చూడాల్సిందే’ అన్నారు.
శ్రీవెంక సినీ చిత్ర పతాకంపై ఈ చిత్రాన్ని బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. కృతికర్బందా హీరోయిన్‌గా నటిస్తోంది.చక్కని కుటుంబకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనిఆకట్టుకుంటుందన్న నమ్మకముంది. బొమ్మరిల్లు, పరుగు లాంటి కుటుంబకథా చిత్రాల తర్వాత ఆ స్థాయిలో భాస్కర్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. రామ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఎనర్జిటిక్‌గా వుంటుంది అని నిర్మాత అన్నారు. ఒంగోలు గిత్త రామ్ సమర్పకుడు బాపినీడు మాట్లాడుతూ... ప్యామిలీ టచ్ తో కూడిన మంచి మాస్ ఎంటర్ టైనర్‌గా చిత్రం రూపొందుతోంది. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఈ సినిమాకి హైలెట్‌గా ఉంటుంది. మార్కెట్ యార్డు నేపథ్యంలో ఈ కథ జరుగుతుందని వెల్లడించారు.

No comments