ఎవరి టాలెంట్ వారిదే
కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం గురించి అందాల తార సమంత మాట్లాడుతూ ‘నన్ను ఏ ఒక్క నటితో పోల్చవద్దు దయచేసి...ఎవరి టాలెంట్ వారిదే...నంబర్ల రేసు మీద నాకు ఏ మాత్రం ఇంట్రస్ట్ లేదు. ఇక సీతమ్మ వాకిట్లో చిత్రానికి వస్తున్న రెస్పాన్స్‌కు ఎంతో ఆనందంగా ఉంది. చాలా కాలానికి ఒక మంచి ఫ్యామిలీ చిత్రంలో నటించాననే అనుభూతి కలిగింది. అంతమంది సీనియర్లతో నటించడం కూడా చాలా తృప్తినిచ్చింది. ఈ చిత్రంలో సీతగా చేసిన అంజలి ఆల్రెడీ తమిళంలో ప్రూవ్డ్ నటి. తొలి సారి తెలుగులో స్ట్రయిట్ చిత్రంలో నటించినా ఎంతో గొప్పగా చేసింది. పాత్ర చిన్నదా...పెద్దదా అని మేమెవ్వరం చూడలేదు. బాగా చేశామా లేదా అనేదే చూసుకున్నామంతా. మహేష్, వెంకటేష్‌లే ఈ చిత్ర విజయానికి ముఖ్యకారకులు. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. నా సినిమాలన్నీ విజయవంతం అవుతున్నాయంటే అందుకు వారి ఆదరణే ముఖ్యం. తమిళం కన్నా ఎక్కువగా తెలుగు చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తాను.
ఇక్కడి వాతావరణం...గౌరవం...ట్రీట్‌మెంట్ అన్నీ నాకు బాగా నచ్చాయి. అందుకే హైదరాబాద్‌కు రీసెంట్‌గా మకాం మార్చేశాను. సీతమ్మ వాకిట్లో చిత్రంలో వచ్చే క్లైమాక్స్ సన్నివేశంలో భద్రాచలం ఎపిసోడ్ చాలా బాగా నచ్చింది నాకు. ప్రకాష్‌రాజ్ నటన సింప్లీ సూపర్బ్. ఇక నా చిత్రాలకు నేనే పెద్ద క్రిటిక్. నేను చేసే అన్ని క్యారెక్టర్లు నాకుగా నేనేవిమర్శించుకుంటుం టాను. వాస్తవానికి ‘ఏం మాయ చేశావె’లో నా క్యారెక్టర్ నాకు అంతగా నచ్చలేదు. అయినా సినిమా మాత్రం బాగా ఆడింది. బాలీవుడ్‌కు వెళ్లే యోచన ప్రస్తుతానికి లేదు. నేను చేసిన చిత్రాలలో ‘జబర్దస్త్’ చిత్రం పూర్తయ్యింది. వచ్చే నెలలో విడుదల కాబోతోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం కూడా తప్పక విజయవంతం అవుతుంది. ఆమె మంచి టాలెంటెడ్ దర్శకురాలు. అవార్డుల కోసం నేను ఎప్పుడూ నటించను

No comments