ఉగ్రవాద నీలి నీడలతో బెదిరిపోయింది
సంక్రాంతి వేళ రాష్ట్ర రాజధాని బాంబు భయంతో వణికిపోయింది. ఉగ్రవాద నీలి
నీడలతో బెదిరిపోయింది. రాష్ట్ర శానస సభ ప్రాంగణంలో బాంబు పెట్టామని ఒక పక్క
బెదిరింపు ఫోన్ కాల్... దీన్ని పరిశీలించేలోపే పురానాపూల్‌లో పేలుడు
పదార్థాలు పట్టబడ టం... గంట వ్యవధిలోనే ఈ పరిణామాలు చోటు చేసుకు న్నాయి.
దీంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమ య్యాయి. నిఘా వర్గాలు హుటాహుటిన
రంగంలోకి దిగాయి. ప్రత్యేక పోలీసు బలగాలు నగరాన్ని జల్లెడ పడుతున్నాయి. ఇం
టిలిజెన్స్ వర్గాలు అన్ని కోణాల నుంచి ఆరా తీస్తున్నాయి. అను మానిత
ప్రదేశాల్లో శోదాలు నిర్వహిస్తున్నాయి. అపరచి తులను గుచ్చిగుచ్చి
ప్రశ్నిస్తున్నాయి. సమస్యాత్మక ప్రాంతా ల్లో పెద్ద ఎత్తున బందోబస్తు
ఏర్పాటు చేశారు. నగర శివార్లలో ఉన్న చెక్‌పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం
చేశారు. జంట నగరాల కమిషనరేట్ల పరిధిలోని పోలీసులు నిఘా వ్యవస్థను పెంచారు.
అసాంఘికశక్తులు, నేర చరితుల ఆనవాళ్ళ కోసం ప్రయత్నిస్తున్నారు.
అసెంబ్లిdకి బాంబు బెదిరింపు!
రాష్ట్ర అసెంబ్లిd ప్రాంగణంలో బాంబు పెట్టినట్టు ఆగంతకుడు శనివారం ఫోన్ చేశాడు. కంట్రోల్ రూంకు సాయంత్రం 4 గంటల మధ్య వచ్చిన ఈ సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సైఫాబాద్ స్టేషన్ పరిధిలోని సిబ్బంది హుటాహుటినా శాసనసభ ప్రాంగణానికి చేరుకున్నారు. డాగ్‌స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో అణువణువు శోధించారు. అన్ని పార్టీల శాసనసభా పక్ష కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. బాంబు గుర్తింపు పరికరాలు ఉపయోగించిన నిపుణులు మూలమూలను పరిశీలించారు. విఐపిలు ప్రవేశించే గేట్-1, ఇతరులు వచ్చే మార్గం గేట్-2ను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఉదయం నుంచి అసెంబ్లిdకి వచ్చిపోయిన వారి వివరాలు సేకరించారు. సిసి కెమెరాల్లో నిక్షిప్తమైన వీడియోలను పరిశీలించారు. సంక్రాంతి సందర్భంగా ప్రజాప్రతినిధులెవ్వరూ అసెంబ్లిdకి రాలేదు. దీంతో అన్ని విభాగాలూ బోసిబోయి ఉన్నాయి. అయినప్పటికీ అక్కడున్న సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. దాదాపు రెండున్నర గంటల పరిశీలన అనంతరం, వచ్చింది కేవలం బెదిరింపు కాల్‌గా గుర్తించి, ఊపిరి పీల్చుకున్నారు. ఈ లోగా ఫోన్‌కాల్ వచ్చిన ప్రాంతాన్ని, చేసిన వ్యక్తిని గుర్తించారు. ఒ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే, ఈ వివరాలేవీ పోలీసులు వెల్లడించలేదు.
పురానాపూల్‌లో బాంబు
అసెంబ్లిd ఆవరణలో శోదాలు చేస్తున్న తరుణంలోనే నగరం మొత్తం పోలీసులు జల్లెడ పట్టారు. పునారాపూల్‌లో ఓ అనుమానిత ద్విచక్ర వాహనం సీటు కింద బాంబు అమ ర్చినట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. దీన్ని వెంటనే నిర్వీర్యం చేయడంతో ప్రమాదం తప్పిపోయింది. గాంధీబొమ్మ వద్ద పార్కింగ్ చేసి ఉంచిన ద్విచక్ర వాహనం ఎవరిది? బాంబు పెట్టింది ఎవరు? అనే కోణంగా ఆరా తీశారు. ఇదిలా ఉంటే, పురానాపూల్‌లోని వాహనంలో తమకు ఎలాంటి బాంబు దొరకలేదని సౌత్‌జోన్ పోలీసులు తెలిపారు. తనిఖీల సందర్భంగా జిలిటిన్‌స్టిక్స్ (పేలుడు పదార్థాలు) పట్టుబడినట్టు వెల్లడించారు. నగర ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అన్ని చోట్ల అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు.

No comments